Categories: FeaturedGeneral News

కరోనాని వ్యాపించండి అంటూ సోషల్ మీడియా లో పిలుపునిచ్చిన ఇన్ఫోసిస్ ఉద్యోగి.. అరెస్ట్ చేసిన పోలీసులు.

ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం సృష్టిస్తుంది. ఎక్కడో చైనాలో మొదలైన కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. మన దేశంలో కూడా రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. దేశంలోని ప్రజలంతా భయంతో విలవిలలాడుతుంటే మరో వైపు కొందరు ఈ వినోదంలా అనిపిస్తుంది. తాజాగా బెంగుళూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగి ముజీబ్ మహమ్మద్ “అందరు ఇళ్లలో కాకుండా బయట వీధుల్లోకి వెళ్లి తుమ్మలని కరోనా వైరస్ ని వ్యాపింపచేయాలంటూ…” పేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.

ఇటువంటి విపత్కర సమయంలో ఇటువంటి పోస్టు పెట్టిన ఇతడిని పోలీసులు ఆరెస్ట్ చేసి కేసు పెట్టారు. అంతేకాదు ఇతని చర్య తమ నియమావళికి విరుద్ధమని, ఇది కావాలనే అతడు చేసినట్టుగా అనిపిస్తుందని ఇన్ఫోసిస్ యాజమాన్యం కూడా అతనిని తమ సర్వీసులనుంచి తప్పిస్తున్నట్టుగా ఆ ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇతడి చర్య వల్ల సంస్థ ప్రతిష్ట డెబ్బదినేలా ఉందని పేర్కొంది. అసలే దేశంలో 900 లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 20కి చేరుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తూ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గట్టి నివారణా చర్యలు తీసుకుంటున్నందుకు చాలా వరకు మరణాలను నియంత్రించ గలిగామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరో పక్క ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే ముజీబ్ వంటి ఉద్యోగుల పట్ల ఆయా సంస్థలు కఠినంగా వ్యవహరించాలని కోతురున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago