సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం.అలాగే కొన్ని పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి ఇలాంటి ప్రమాదాలు హీరో హీరోయిన్ల ముఖ కవళికలు మారిపోవడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ విషయంలో కూడా జరిగిందని ఆయన వెల్లడించారు.
తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా హిందీ రీమేక్ చిత్రం చేస్తున్నారు. ఈ రీమేక్ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కడం వల్ల ఈ సినిమా షూటింగ్ కోసం షాహిద్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
ఈ సమయంలో బాల్ చాలా బలంగా తన పెదవికి తగిలిందని ఆ సమయంలో పూర్తిగా తన పెదవి మొత్తం గాయపడిందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ ప్రమాదంలో తన పెదవికి ఏకంగా 25 కుట్లు పడ్డాయని ఇక తన పెదవి మొత్తం పాడైపోయిందని భావించారు. కొద్దిరోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు.
ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి తనకు సుమారు రెండు నెలల సమయం పట్టిందని అందుకోసమే రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేశారని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ జెర్సీ సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…