ఆస్ట్రాలజీలు కొందరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందీ అంటారు. వారు చెప్పేదే జరుగుతుందని ప్రచారాలు చేస్తుంటారు. అందుకు ఉదాహరణ ఇటీవల సమంత, నాగ చైతన్య విడాకుల విషయం. ఇలా జరుగుతుందని ముందే చెప్పానని ఓ సినీ, రాజకీయ నాయకులకు జాతకాలు చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్ చెప్పుకొచ్చారు. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ పెళ్లి విషయంలో ఏం జరుగుతుందో కూడా ముందే ఆయన చెప్పారు. అదే జరిగిందని అన్నారు. అలా జరుగుతుందని తెలిసినప్పుడు ముందే వారికి నమ్మకం కలిగేలా చెప్పి ఇంత దూరం రాకుండా చేయాల్సింది అని ఈ మధ్య అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడున్న జనరేషన్‌లో జాతకాలు నమ్మేవారి సంఖ్య కొంతవరకు తగ్గిందనే మాట వాస్తవం. మనం కష్టపడితేనే కడుపు నిండుతుంది. ఖాళీగా కూర్చుంటే ఎవడూ వచ్చి నోట్లో ముద్ద పెట్టడు. దానికోసం దొరికిన పని చేతనైన పని చేయగలిగిన పని చేసుకోవాల్సిందే. ఇండస్ట్రీలో జాతకాలను, దేవుళ్ళను నమ్మేవారు ఉన్నారు. నమ్మని వారూ ఉన్నారు. నమ్మని వారిలో ఉదాహరణగా రాం గోపాల్ వర్మను, పూరి జగన్నాధ్ లాంటి వారిని తీసుకోవచ్చు. నమ్మేవారిలో బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి స్టార్స్‌ను తీసుకోవచ్చు.
అయితే వీరు సినిమాలు చేయకుండా కష్టపడకుండా లాభాలు వస్తున్నాయా అంటే దీనికి సమాధానం అందరికి తెలిసిందే. అయితే ఆస్ట్రాలజర్లకు సినిమా వారి జీవితాలలో ఏం జరుగుతుందో చెప్పే కెపాసిటీ ఉంది. ఇది బాగానే ఉంది. ఇందులో వారు సిద్దహస్థులు.. గొప్పవారు. కాదనేది లేదు. అదే సినిమా ఇండస్ట్రీలో వందల కోట్లు పెట్టి తీసుకున్న సినిమాల ఫలితాలు కూడా తమకున్న జ్ఞానం, పరిజ్ఞానంతో ముందే చెప్పొచ్చు కదా అనేది నెటిజన్స్ద్ మాతమే కాదు కొందరు సినీ ప్రేమికులు చెప్పుకునే మాట.
వాస్తవంగా ఈ జంట ఇప్పుడు విడిపోతారు. ఈ జంట పెళ్ళి చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. వీరు బయటకు మాత్రమే అన్యోన్యంగా కనిపిస్తారు. పెళ్ళి తర్వాత ఇన్నేళ్ళకు విడాకులు తీసుకుంటారు.. ఈమె ఆ వ్యక్తిని చేసుకుంటే జైలుపాలవుతుంది.. అనే విషయాలను చక్కగా చెప్పగలిగినప్పుడు.. ఓ సినిమా ఫలితం చెప్పలేరా అనేది కొందరి వాదన. సినీ తారల మీద పెట్టే ఫోకస్.. సినిమా రిజల్ట్ మీద పెడితే నిర్మాతలు ఫ్లాపయ్యే సినిమాలను తీయరు కదా అని అడుగేవారున్నారు ఇప్పుడు. అలా ముందే తెలిస్తే ప్రభాస్ సాహో సినిమా తీసి చేతులు కాల్చుకోడు కదా.
బాహుబలి లాంటి సినిమా తీసి దేశవ్యాప్తంగా అందరి మన్నలను పొందిన రాజమౌళి ఇప్పుడు తీస్తున్న ఆర్ఆర్ఆర్ ఎన్నివేల కోట్ల వసూళ్లు రాబడుతుందో.. నిర్మాతలకు ఎంతవరకు లాభాలు తీసుకు వస్తుందో ఓ ఖచ్చితమైన ఫిగర్ చెప్పొచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఇలా చెప్పగలిగే ఆస్ట్రాలజర్లు ఉంటే ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు మిగతా ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్లాప్ సినిమా తీసే మేకర్స్ ఉండరు కదా. అన్నీ లాభాలు వచ్చే సినిమాలను తీస్తారు.. అని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఓ విధంగా ఆలోచిస్తే అసలే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీకీ వేల కోట్ల నష్టం వాటిల్లింది. అది ఎలా భర్తీ అవుతుందో చెప్తే నిర్మాతలు ఆ ప్రయత్నాలు చేస్తారు కదా అని మాట్లాడుకుంటున్నారు.
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…
టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…
టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా…
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…