Featured

ANR ఆ నలుగురుతో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.!!

హీరో హీరోయిన్, హీరో దర్శకుడు, హీరో నిర్మాత ఇలా ఎవరైనా కావచ్చు ఒక్కోసారి ఈ కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. మరొకసారి ఎన్నిసార్లు ఈ కాంబినేషన్ రిపీట్ అయిన ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. అలాంటిదే ఏఎన్ఆర్ మిగతా నలుగురు అగ్రహీరోలతో కలిసి నటించిన సినిమాల విషయంలో జరిగింది.

1986లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇదే సంవత్సరం వైజయంతి మూవీస్, అశ్వినీదత్ నిర్మాణం, మురళీమోహన్ రావు దర్శకత్వంలో బ్రహ్మరుద్రులు చిత్రం విడుదలయ్యింది.

ఈ సినిమాలో వెంకటేష్, రజిని హీరో, హీరోయిన్లతో ఏఎన్నార్ కలిసి నటించారు. బ్లాక్ బస్టర్ కలియుగ పాండవులు చిత్రం తర్వాత ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగుముఖం పట్టింది.

ఆ తర్వాత 1990 అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని వెంకట్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘ఇద్దరూఇద్దరే’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో కనిపించగా, నాగార్జున, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని మూటకట్టుకుంది.

1993 గీతా ఆర్ట్స్ నిర్మాణం, అల్లు అరవింద్ నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించారు. చిరంజీవి, నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మొదటి, చివరి చిత్రంగా మెకానిక్ అల్లుడు చెప్పుకోవచ్చు. బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం స్టేట్ రౌడీ సూపర్ డూపర్ హిట్ కాగా మెకానిక్ అల్లుడు చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.

1994 సంపత్ కుమార్ నిర్మాణం, ప్రియదర్శన్ దర్శకత్వంలో గాండీవం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ, రోజా హీరోహీరోయిన్లు నటించగా ప్రధాన పాత్రల్లో నాగేశ్వరరావు, మోహన్ లాల్ కలిసి నటించారు. ‘గోరువంక వాలగానే గోకులానికి.. అనే పాట ఆ రోజుల్లో ప్రజాదరణ పొందింది. అయినా సినిమా పరాజయం పొందింది. ఇలా అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago