Featured

శుభలేఖ సుధాకర్ ఆరోజు అసభ్యంగా ప్రవర్తించి.. యూనిట్ సభ్యుల ముందు సారీ చెప్పారు. – గౌతమి

సినీ పరిశ్రమలో తాము కాకుండా పాత్రలే కనిపించే నటనను కనబరిచే అతి కొద్దిమంది నటుల్లో శుభలేక సుధాకర్ ఒకరు.అర్థం కాని హావభావాలు,మితిమీరిన నటనను పక్కకు పెట్టి, పాత్రోచితంగా నటించడం శుభలేఖ సుధాకర్ సొంతం. శుభలేఖ అనేది ఆయన ఇంటిపేరు కాదు. 1982 విజయసాయి ఫిలిమ్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభలేఖ’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, సుమలత హీరో, హీరోయిన్లుగా నటించగా.. సుధాకర్, తులసి ఒక జంటగా కనిపించారు. సినిమా విజయవంతం అవడంతో సుధాకర్ కి మంచి పేరు వచ్చింది. ఇక అప్పటినుంచి సుధాకర్ కాస్త శుభలేఖ సుధాకర్ అయ్యారు.

ఆయన మంత్రిగారి వియ్యంకుడు, రెండుజెళ్ళసీత లాంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఆ తరువాత సుధాకర్ కి 1986లో సీనియర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన “లేడీస్ టైలర్” చిత్రం శుభలేఖ సుధాకర్ ని మరో మెట్టు ఎక్కించింది. నిజంగా ఈ సినిమా అతని కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తరువాత 1989 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ చిత్రంలో నాగార్జున కాలేజి స్నేహితుడిగా శుభలేఖ సుధాకర్ మంచి నటనను కనబరిచారు. ఈ చిత్రం విజయవంతమవడంతో శుభలేఖ సుధాకర్ కి మరిన్ని అవకాశాలు వచ్చాయి.

అలా కొన్ని చిన్న పాత్రలు చేసుకుంటూ.. 1995లో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, పీసీ.శ్రీరామ్ దర్శకత్వంలో ‘ద్రోహి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అర్జున్, గౌతమి హీరో, హీరోయిన్లుగా నటించారు. సమాజానికి పట్టిన చీడ పురుగులను అరికట్టడంలో ధైర్యవంతులైన పోలీస్ పాత్రలో కమల్ హాసన్, అర్జున్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. లోగడ అర్జున్ ఇలాంటి పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమాలో కమల్ హాసన్ విభిన్నమైన పోలీస్ పాత్రలో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. సినిమా విజయానికి పీసీ.శ్రీరామ్ కెమెరా పనితనం అధనపు ఆకర్షణగా నిలిచింది.

కథలోకి వెళితే.. పై ఆదేశాల మేరకు శుభలేఖ సుధాకర్, అతనితో మరొక మహిళ కమలహాసన్ ఇంట్లో అతిథులుగా చేరుతారు. కమల్ హాసన్ డ్యూటీ పై ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. మానవతా విలువలు మరిచిపోయి ఉగ్రవాది(శుభలేఖ సుధాకర్), గౌతమీ పై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ క్రమంలో గౌతమి శుభలేక సుధాకర్ కు లొంగిపోయినట్టుగా నటించి చివరికి పిస్టల్ తో ఉగ్రవాదిని (శుభలేఖ సుధాకర్ ను) కాల్చి చంపుతుంది. ఈ సీన్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని.. గౌతమి, శుభలేఖ సుధాకర్ ను అలా చేయడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. శుభలేఖ సుధాకర్ షూటింగ్ సమయంలో అలా చేసినందుకు.. క్షమించండి మేడం అని పదే పదే చెప్పడం జరిగిందని గౌతమి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago