మల్టీస్టారర్ చిత్రాలు ఇప్పుడే కొత్తగా వచ్చినవి కావు. ఆనాటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఈ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. జనరేషన్స్ మారిన కొద్దీ.. కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం అనేది జరుగుతుంది. అలా ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోస్ మల్టీ స్టారర్ గా నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలువగా మరి కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అలా కృష్ణ, శోభన్ బాబు ఒక మల్టీ స్టారర్ చిత్రం… కృష్ణంరాజు, కృష్ణ మరొక మల్టీస్టారర్ చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులను రంజింపజేసాయి.
అయితే “దో ఆంఖే బారా హాత్” అనే విజయవంతమైన చిత్రాన్ని బాలీవుడ్ నుంచి రీమేక్ చేస్తూ ‘మా దైవం’ అనే చిత్రాన్ని ఎన్టీ రామారావు తో తీయడం జరిగింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగు ముఖం పట్టింది. ఆ సినిమా పరాజయం అయినప్పటికీ ఎందుకో రచయిత సత్యానంద్ కు ఆ కథ బాగా నచ్చింది. ఆ సినిమాలోని మూల కథను తీసుకొని చాలా వరకు మార్పులు చేర్పులు చేసుకొని ఓ కొత్త కథ సిద్ధం చేసి హీరో శోభన్ బాబు, కృష్ణ లకు వినిపించారు. ఆ కథ బాగా నచ్చడంతో వారిద్దరూ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. లోగడ శోభన్ బాబు, కృష్ణ కాంబోలో వచ్చిన ముందడుగు చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో.. మరో ముందడుగు వేసి ఈ చిత్రంలో కలిసి నటించారు.
అలా 1983 లో మద్రాసులోని వాహినీ స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కైకాల సత్యనారాయణ తమ్ముడు నాగేశ్వరరావు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఇద్దరు దొంగలు’ చిత్రం విడుదలయ్యింది. ఇందులో శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, రాధా హీరో హీరోయిన్లుగా నటించారు. అనుకున్నట్టుగ 1983 విజయదశమికి విడుదల కావలసిన ఈ చిత్రం రాఘవేందర్ రావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ క్రమంలో సినిమా విడుదల తేదీని సంక్రాంతికి వాయిదా వేశారు. టి. త్రివిక్రమరావు నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యుద్ధం’ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ చిత్రంలో కృష్ణంరాజుతో కృష్ణ మరొక హీరోగా నటించగా జయసుధ, జయప్రద హీరోయిన్లుగా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “ఇద్దరు దొంగలు”.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “యుద్ధం” చిత్రం ఈ రెండు సినిమాలు 1984 జనవరి 14న విడుదలయ్యాయి. విచిత్రమేమంటే దాసరి దర్శకత్వంలో వచ్చిన యుద్ధం సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తాకొట్టగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు దొంగలు చిత్రం విజయవంతమయ్యింది. ఈ రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో హీరో కృష్ణ నటించడం గమనార్హం. ఇలా ఒకే తేదీన ఒకే హీరో చిత్రాలు విడుదలవడమన్నది ఇదే ప్రథమం.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…