Featured

“మన్యంలో మంగమ్మ”షూటింగ్ మధ్యలో ఆగిపోయి ఓ బ్లాక్ బస్టర్ ‌ సినిమాగ విడుదలైందని మీకు తెలుసా..!!

దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యులైన కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు లాంటి శిష్యుల్లో ఒకరాయన. కాకపోతే మిగతా శిష్యులతో పోలిస్తే ఈయన ఎంచుకున్న జోనర్ వేరు. ఆయన తీసిన సినిమాలన్నీ విప్లవాత్మక ధోరణిలో ఉండేవి. కార్మికుల కష్టాలు, పేదవారి ఆకలి, ఆక్రందనలే ఆయన ప్రధాన కథ. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, సామాజిక సందేశం, సమాజ మార్పు అనేది గట్టిగా నమ్మిన దర్శకుడు. ఆయన జీవితంలో ఎదురైన, స్వయంగా చూసిన సామాజిక స్థితిగతులను దృశ్య రూపకంగా మలచి నిలువుటద్దంలా ప్రేక్షకుల ముందు ఉంచారు.

పశ్చిమగోదావరి, నరసాపురంలో జన్మించిన ధవళ సత్యం. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రజానాట్య మండలిలో పనిచేశారు. జనసంద్రంలో తాను ఒక ఇసుకరేణువుగ భావించి భావిభారత పునర్నిర్మాణానికి తనవంతు కృషిగా సామాజిక మార్పుకోసం అనేక నాటకాలను ప్రదర్శించారు. సత్యంవధ, ఇరుసు, జ్వాలా శిఖలు లాంటి నాటకాలను ప్రదర్శనతో ఆయనకు మంచి పేరు వచ్చింది. మద్రాసులో అడుగుపెట్టిన తర్వాత ఆయన దాసరి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆయన మహమ్మద్ బీన్ తుగ్లక్, శివరంజని, రంగూన్ రౌడీ, రాముడే రావణుడు లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత సుప్రీం హీరో చిరంజీవితో ఒక సినిమా చేశారు.

1980లో రామరాజు నిర్మాణము, ధవళ సత్యం దర్శకత్వంలో చిరంజీవి, లీలావతి హీరో, హీరోయిన్లుగా జాతర సినిమాలో నటించారు. ఆ తర్వాత ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, గుడి గంటలు మ్రోగాయి, రామాపురంలో సీత, భీముడు లాంటి సినిమాలను రూపొందించారు. ఆ తర్వాత మాదాల రంగారావు కొడుకు మాదాలరవి తో నేను సైతం అనే సినిమాను రూపొందించారు. గిరిజన స్థితిగతులను చూసి, స్పందించిన ధవళ సత్యం వారి జీవన విధానాలపై ఒక సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో గిరిజనతండాలో ఒక మహిళకు ఎదురైన ప్రతిబంధకాలు, వాటిని ఎదుర్కోవడంలో ఆ మహిళ ఏ విధంగా పోరాటం చేసి చివరికి గెలిచిందో అనే అంశంపై ఆ రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ లో శరత్ బాబు, శ్రీనివాసవర్మ, శారద ప్రధానపాత్రలో “మన్యంలో మంగమ్మ” సినిమా షూటింగ్ ధవళ సత్యం మొదలుపెట్టారు.

దాదాపు పదిహేను రోజుల వరకు షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కథ శారద ద్వారా ఇతర రచయిత, దర్శకులకు తెలిసింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1997లో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణరావు ఒసేయ్ రాములమ్మ అనే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అయితే శారద ప్రధానపాత్రలో మన్యంలో మంగమ్మ అనే ఆగిపోయిన సినిమా కథ,ఒసేయ్ రాములమ్మ కథ ఒకటేనని.. దవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago