పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో మొదటి సినిమా చేసే అవకాశం అందుకోవడం అంటే దర్శకుడిగా ఏ రేంజ్ సత్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాం గోపాల్ వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పూరి జగన్నాథ్ మొదటి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేసే అవకాశం అందుకున్నాడు. “నీకు అరగంటే టైం..ఈలోపే కథేంటో చెప్పు” అని పవన్ కళ్యాణ్, పూరిని డైలమాలో పడేశాడు. అది కూడా తెలవారుజామున 4గంటలకి. కథ చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిన పూరి.. దాదాపు నాలుగు గంటలు బద్రి కథ చెప్పాడు. ఈ కథ పవన్ కళ్యాణ్‌కి విపరీతంగా నచ్చింది. వెంటనే చేసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అలా పూరి జగన్నాథ్ దర్శకుడిగా మొదటి సినిమా పవన్ కళ్యాణ్‌తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి లాంటి బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ తీసి క్రేజీ డైరెక్టర్‌గా మారాడు పూరి జగన్నాథ్. దాంతో టాలీవుడ్ మేకర్స్ ఆయనతో సినిమాలు నిర్మించడానికి క్యూ కట్టారు. అలాగే హీరోలు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు. అప్పటికే పూరి జగన్నాథ్ వైష్ణో అకాడమి అనే బ్యానర్‌ను స్థాపించి సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు తీస్తూ కూడా హిట్స్ అందుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆయన ఆంధ్రావాలా అనే సినిమాను తీశాడు. జూనియర్ ఎన్.టి.ఆర్ ఇందులో హీరో. అప్పటికే పూరితో ఇడియట్, శివమణి సినిమాలలో హీరోయిన్‌గా నటించిన రక్షిత ఇందులో హీరోయిన్‌గా నటించింది. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించగా ఏకంగా స్పెషల్ ట్రైన్స్ కూడా వేసి అభిమానులు ఈవెంట్‌కి హాజరయ్యేలా ప్లాన్ చేశారు. అప్పటికే చక్రి అందించిన ఆంధ్రావాలా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజికల్‌గా కూడా మంచి హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు భాగా పెరిగాయి.
కానీ తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అప్పటివరకు వరుస హిట్స్ అందుకుంటూ మంచి ఊపు మీదున్న పూరికి ఊహించని షాక్ తగిలింది. ఒకరకంగా ఇది తారక్‌కి గట్టి దెబ్బ. ఆ సమయంలో పూరి జగన్నాథ్ చాలా బాధపడ్డారు. తారక్‌కి ఫోన్ చేసి సారీ అన్నాడు. అప్పుడు తారక్..జగన్ నీకు నచ్చి కథ చెప్పావు..నాకు నచ్చి సినిమా చేశాను. అన్నీ సినిమాలు హిట్ అవ్వాలని లేదు కదా..జనాలకి మన సినిమా నచ్చలేదు. మళ్లీ మంచి కథతో ట్రై చేద్దాం.. అన్నాడు. ఇంకో హీరో అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌ను అవైడ్ చేస్తాడు. కానీ తారక్ మాటిచ్చాడు. అలాగే టెంపర్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నారు.
ఇక ఆంధ్రావాలా సినిమా తర్వాత పూరి ఆర్ధికంగానూ చాలా నష్టపోయాడు. ఉన్న ఆస్థులన్నీ పోయి దాదాపు రోడ్డు మీదకి వచ్చేశాడు. స్టార్ డైరెక్టర్‌గా ఒక వెలుగు వెలిగిన పూరికి చుట్టూ చీకటి ప్రపంచమే కనిపించింది. ఆ సమయంలో ఎవరు ఏంటో కూడా తెలుసుకున్నాడు. మళ్ళీ తేరుకొని తమ్ముడు సాయి రాం శంకర్‌ను హీరోగా పరిచయం చేస్తూ 143 సినిమా తీసి హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత హిట్స్ వచ్చిన, ఫ్లాప్స్ వచ్చిన ఒకే రేంజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. గత చిత్రం ఇస్మార్ట్ శంకర్‌తో బౌన్స్ బ్యాక్ అయిన పూరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…