సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న చాలామంది బాలీవుడ్ మీదే ఎక్కువగా దృష్ఠిపెట్టడానికి ఉత్సాహపడుతుంటారు. అందుకు కారణం లేకపోలేదు. తెలుగులో హీరోయిన్‌గా చేస్తే తెలుగులో మాత్రమే పాపులారిటీ వస్తుంది. తమిళంలో చేస్తే తమిళంలో మాత్రమే పాపులారిటీ వస్తుంది. ఇంకా కాస్త క్రేజ్ అంటే వారు నటించే సినిమాలు అటు తమిళం, ఇటు తెలుగు భాషలలో రిలీజై హిట్ సాధిస్తే అప్పుడు సౌత్‌లో బాగా పేరొచ్చి స్టార్ హీరోయిన్‌గా మారతారు. అదే ఒక్క బాలీవుడ్ సినిమాలో గనక హీరోయిన్‌గా నటించి అది బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగాను పాపులారిటీని సంపాదించుకోవచ్చు.
అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. అందుకే మన స్టార్ హీరోలు కూడా ఎప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ సంపాదించుకునేందుకే ఆరాటపడుతుంటారు. ఇక్కడ సూపర్ హిట్ అయిన యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాకు అక్కడ బాగానే లాభాలు వస్తున్నాయి. అంతేకాదు మన హీరోలకు అక్కడ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది, బాగా ఆదరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలైన ధనుష్ లాంటి వారూ హిందీ సినిమాలలో నటించేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీకి గ్లామర్ అంటే హీరోయిన్సే. ఒక్క భాషలో రెండు సూపర్ హిట్స్ అందుకుంటే వారి మీద ఇప్పుడు బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు బాగానే ఫోకస్ చేసి అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా తెలుగు నుంచి హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిన పూజా హెగ్డే, రష్మిక మందన్న వరుసగా క్రేజీ మూవీస్‌లలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే రష్మిక అక్కడ మూడు సినిమాలు చేస్తుండగా, పూజా హెగ్డే రెండు సినిమాలు చేస్తోంది. ఇక రకుల్ టాలీవుడ్‌లో బాగా వెనకబడినా కూడా హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది.
అంతేకాదు తాప్సీ తెలుగులో వెలగలేకపోయినా బాలీవుడ్‌లో బాగా వెలుగుతోంది. అక్కడ నిర్మాతగానూ సినిమాలు చేస్తోంది. ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ఇదే బాటలో కంచె భామ ప్రగ్యా జైస్వాల్ కూడా బాలీవుడ్ మీద ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టి ఎట్టకేలకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన యాంటిమ్ అనే సినిమాలో నటించే ఆకాశం అందుకుంది. ఈ సినిమాలో ప్రగ్యా సల్మాన్‌తో కలిసి మంచి రొమాంటిక్ సీన్స్ కూడా చేసిందట. కాని చివరి నిముషంలో ఆ సీన్స్ మొత్తం ఎడిటింగ్‌లో తీసేశారట.
సినిమా లెంగ్త్ బాగా ఎక్కువవడంతోనే అంతగా ఇంపార్టెన్స్ లేని ప్రగ్యా జైస్వాల్ సీన్‌ను తీసేశారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ మీద ఆశలు పెట్టుకున్న ప్రగ్యాకి ఓ పెద్ద హీరోతో అవకాశం వస్తే అది ఆమెకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోయింది. ఇలా చేసిన సినిమాలో పాత్రనే తీసేస్తే ఇక ఆమెకు మళ్ళీ హిందీ సినిమాలలో అవకాశాలు వస్తాయా అనేది చెప్పడం కాస్త కష్టమే. సల్మాన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రగ్యాకు ఇది ఊహించని షాక్. చూడాలి మరి మళ్ళీ ప్రగ్యాకు బాలీవుడ్ ఛాన్స్ వస్తుందో లేదో. ఇక తెలుగులో బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. తెలుగులోనూ అంత సక్సెస్‌ఫుల్‌గా సాగని ప్రగ్యా కెరీర్ అఖండ తర్వాత అయినా జోరందుకుంటుందా చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…