Featured

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతను తొక్కేస్తారన్నారు. అంత సీన్ లేదు.. ఇప్పుడు ఎన్ని సినిమాలున్నాయో చూడండి..!

సినిమా వాళ్ళైనా, బయట వాళ్ళైనా వ్యక్తిగత జీవితం వేరు.. వృత్తి జీవితం వేరు. రెంటినీ ఒకే స్కేలుపై చూడకూడదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఓ జంట విడాకులు తీసుకొని విడిపోతే ఆ తర్వాత వచ్చే రూమర్స్, కామెంట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తాజాగా విడాకులు తీసుకున్న సమంత-అక్కినేని నాగ చైతన్యలను చూస్తే అర్థమవుతుంది. వారిద్దరి మధ్య విబేధాలు వచ్చి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించారు. అది వాళ్ళిద్దరి పర్సనల్ మ్యాటర్. కానీ ఇక్కడ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోల్ చేసింది సమంతనే.

విడాకుల తర్వాత నాగ చైతన్య మీద వచ్చిన వార్తలు చాలా తక్కువ. అవి కూడా పెద్ద నెగిటివ్ కాదు. కానీ సమంత మీద వచ్చిన వార్తలే చాలా రకాలుగా ఉన్నాయి. ఆమెను రక రకాలుగా ట్రోల్ చేయడం, నెగిటివ్‌గా కామెంట్ చేయడం తరచూ జరిగింది. ఇప్పటికీ సమంత ఏదైనా పోస్ట్ పెడితే కొందరు నెటిజన్స్ ఆమెను నెగిటివ్ వేలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇక సినిమా ఇండస్ట్రీలో సమంత కెరీర్ క్లోజ్ అనే ప్రచారాలు జోరుగా సాగాయి. ఈ సమయంలో సమంత చాలా మొండిగా ఎవరెన్ని కామెంట్స్ చేసిన తట్టుకొని నిలబడింది.

తప్పొప్పులు ఎవరివైనా సమంత – నాగ చైతన్య ప్రస్తుతం ఎవరి జీవితం వారు సాఫీగా సాగిస్తున్నారు. చైతూతో విడిపోయినంత మాత్రానా సమంతకు అవకాశాలిచ్చేవారుండరా అంటే అది కేవలం కొందరి అపోహ మాత్రమే. ఇది ప్రస్తుతం సమంత ప్రకటించిన సినిమాల లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. వృత్తి పరంగా ఆమెను వేలెత్తి చూపించడానికి లేదు. కొత్త దర్శకుల నుంచి రాజమౌళి, గుణశేఖర్ లాంటి అగ్ర దర్శకులతో పనిచేసింది. ఎంత టాలెంట్ లేకపోతే ఇలాంటి దర్శకులు సమంతకు అవకాశాలిస్తారు. ఇక్కడ టాలెంట్‌ను పర్సనల్ విషయాలతో ముడిపెట్టకూడదు.

అందుకే దసరా పండుగ నాడు శ్రీదేవీ మూవీస్, డ్రీమ్ వారియస్ పిక్చర్స్ వారి సంస్థలలో వరుసగా రెండు సినిమాలను ప్రకటించింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అలాగే కొత్త కథలను వింటోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప ది రైజ్ పార్ట్ 1 లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ కూడా మొదలుపెట్టనున్నట్టు సమాచారం. ఈ సాంగ్ సినిమాలో చాలా హైలెట్‌గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌లో మంచి ఆఫర్ వస్తే చేసేందుకు సిద్దంగా ఉంది.

ఇంతలోనే ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకముందు సమంతతో ఓ బేని సినిమాను నిర్మించిన సునీత తాటి నిర్మాతగా హాలీవుడ్ సినిమాను సమంత చేసేందుకు సైన్ చేసిందట. ఇండియాతో పాటు విదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరపబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా కొత్త ప్రాజెక్ట్స్ కమిటవుతున్న సమంత కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. త్వరలో ఆమె నటించిన తెలుగు, తమిళ సినిమాలు రెండు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇంత బిజీగా ఉంటే సమంతకు అవకాశాలివ్వరు.. తొక్కేస్తారు అనే వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో.. ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఫాస్ట్ ఫుడ్ షాక్.. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ముందు ఇది చదవండి.!

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…

3 minutes ago

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

11 minutes ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

29 minutes ago

విజయ్–రష్మిక పెళ్లికి సూపర్ సర్ప్రైజ్.. ముఖేష్ అంబానీ అందిస్తున్న అద్భుత బహుమతి!

విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…

41 minutes ago

మహేష్–రాజమౌళి ప్రాజెక్ట్‌లో మరో సూపర్ స్టార్… ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…

43 minutes ago

T20 World Cup 2026 : టి20 వరల్డ్‌కప్ కీలక దశలో ప్లేయింగ్ ఎలెవన్ చర్చ.. ఇప్పటికైనా సంజూకు ఒక ఛాన్స్ ఇవ్వండి..

టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…

46 minutes ago