Featured

తన పెంపుడు కుక్కకు అవమానం జరిగిందని షూటింగ్ నుండి వెళ్లిపోయిన హీరోయిన్ ఎవరో తెలుసా.?!

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం అప్పుడు బ్రిటన్ పార్లమెంటులో పనిచేస్తున్న ఓ ధనవంతుడైన కుమారుడు ఇయాన్ ఫ్లెమింగ్. ఈయనకు గూఢచారులు చేసే పనులు అంటే చాలా ఇష్టం. ఆ క్రమంలో ఆయన వారితో ప్రయాణించి వారు వేసే ఎత్తులు పై ఎత్తులను దగ్గరగా చూసేవారు. ఆ క్రమంలో తన 45వ ఏట ఒక రచయితగా మారి గూడచారికి సంబంధించిన నవలలను రాయడం జరిగింది. ఆ క్రమంలో జేమ్స్ బాండ్ అనే ఇంగ్లాండ్ వ్యక్తి యొక్క అనుమతితో ఇయాన్ ఫ్లెమింగ్ తన నవలలో హీరోకి జేమ్స్ బాండ్ అని పేరు పెట్టడం జరిగింది.

‌ అలా సంవత్సరానికి ఒకసారి గూడచారి కి సంబంధించిన నవలను రాసి ప్రచురించేవారు. అలా హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ చిత్రాలు అనేకం వచ్చేవి. జేమ్స్ బాండ్ చిత్రాలు 1960వ దశకంలో మద్రాసులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ఆ క్రమంలో ఆనాటి ప్రఖ్యాత నిర్మాత డూండీ జేమ్స్ బాండ్ తరహా కథతో కూడిన ఒక తెలుగు సినిమా తీయాలనుకున్నారు. అలా ఆయన రచయిత ఆరుద్ర ను కలిసి తన మనసులో మాట చెప్పారు. అప్పుడు ఆరుద్రగారు అంతకుముందే జేమ్స్ బాండ్ చిత్రాలను చూసేవారు. కొంత కాలం సమయం తీసుకొని గూడచారి 116 చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన సుందర్ లాల్ కు కథ చెప్పాలని డూండీ కోరడం జరిగింది. అప్పుడు రచయిత ఆరుద్ర ఆఫీసులోనే కథ చెబితే అసిస్టెంట్ డైరెక్టర్ దానిని అలాగే ఇంగ్లీషులో టైప్ చేసేవాడు. ఆ తర్వాత దానిని తెలుగులో రాసుకొని సంభాషణలు అందించేవారు.

ఈ సినిమా కోసం నిర్మాత డూండీ అప్పుడే తేనె మనుసులు చిత్రంలో హీరోగా నటిస్తున్న కృష్ణ ను కలవడం జరిగింది. జేమ్స్ బాండ్ తరహా కథ తీస్తున్నామని అందులో నువ్వు హీరో వేషం వేయాలని హీరో కృష్ణకు వెయ్యి రూపాయలు అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంటు పేపర్ పై డూండి సైన్ చేయించుకోవడం జరిగింది. అప్పటికి గూడచారి116 కృష్ణ కి రెండో చిత్రం అయినప్పటికీ విడుదల ఆలస్యం అవడం తో కృష్ణ గారి మూడవ చిత్రంగా రావడం జరిగింది. హీరోయిన్ గా తమిళంలో అప్పటికే ఒక విజయవంతమైన సినిమాలో నటించిన జయలలితను గూడచారి 116 సినిమాకి హీరోయిన్ గా ఎన్నుకున్నారు.

అయితే గూడచారి 116 సినిమా దాదాపుగా పూర్తవుతున్న సమయంలో హీరోయిన్ జయలలిత షూటింగ్ లో తన పెంపుడు కుక్క కి అవమానం జరిగిందని షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. తీరా ఏం జరిగిందని దర్శకుడు ఆరాతీయగా విషయం తెలియడంతో దర్శకుడు మల్లికార్జునరావు, డూండీలు స్పందించి నిర్మాతలు అంటే విలువ లేకుండా ఇలా చేయడం ఏంటని.. కృష్ణ తో జయలలితకు మిగిలున్న షాట్స్ ని, కొన్ని క్లోజప్ సీన్స్ ని ముందుగానే తీసుకొని జయలలిత ఇచ్చిన కాల్షీట్స్ కంటే ముందే ఆమెను షూటింగ్ నుండి పంపించడం జరిగింది. ఈ సినిమా 1966లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago