Categories: FeaturedMovie News

సినిమాల్లో గుండెపోటు పాత్రలకి గుమ్మడి వెంకటేశ్వరరావునే ఎందుకు తీసుకునేవారు.?

తాతయ్య, తండ్రి, బాబాయ్, మేనమామ ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా, తెలుగు భాషపై పట్టు స్వచ్ఛమైన ఉచ్చారణ, పాత్రకు తగ్గ వేషధారణ అంటే ఆ రోజుల్లో గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు సాత్వికాభినయ సామ్రాట్ గుమ్మడి వెంకటేశ్వరరావు. ఈయన చేసిన వయస్సుకు మించిన పాత్రలను తెలుగు సినిమా చరిత్రలో మరొకరు చేసి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో తెలుగు సినిమాల్లో ఈయన వృద్ధ పాత్రలకు పెట్టింది పేరు.

గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య గల కొల్లూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో గుమ్మడి వెంకటేశ్వరరావు జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ నాటకాలంటే ఎంతో ఇష్టం ఉండేది. పాఠశాలలో చదువుతూనే నాటకాలపై మక్కువతో అనేక నాటకాలు వేశారు. వ్యవసాయం చేయడం అంటే గుమ్మడి గారికి అంత ఇష్టం ఉండేది కాదు. పాఠశాల చదువు పూర్తయి కళాశాలలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్లీ నాటకాలు అంటూ తిరగడం జరిగింది.

వ్యవసాయం అంటే ఎలాగు ఇష్టం లేదు కాబట్టి తన స్నేహితుల సాయంతో గుమ్మడి వెంకటేశ్వరరావు తెనాలిలోని ఒక రేడియో ఎలక్ట్రానిక్ షాప్ పెట్టడం జరిగింది. అక్కడికి నాటక సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు వస్తుండేవారు. అలా విజయ ప్రొడక్షన్స్ మరియు వాహినీ స్టూడియో అధినేత లో ఒకరైన చక్రపాణి గుమ్మడి ఎలక్ట్రానిక్ షాప్ కు రావడం జరిగింది. ఆ సందర్భంలో గుమ్మడి తోడల్లుడు గుమ్మడి గురించి చక్రపాణికి చెప్పగా చక్రపాణి సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం అని చెప్పాడు.

అలా గుమ్మడి మద్రాసు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సినిమాలో నటిస్తే వంద రూపాయలు వచ్చాయి. మరో సినిమాలో నటిస్తే రెండు వందలు వచ్చాయి. అలా నెల సంపాదన 200రూ.లు అయితే ఖర్చు మాత్రం‌ 400రూ.లు ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు, గుమ్మడిని చూసి నోరెళ్లబెట్టారు. ఈ నెల సంపాదన ఎంత ఉంటే ఖర్చు కూడా అంతే పెట్టాలని ఎన్టీరామారావు చెప్పడంతో గుమ్మడి దానిని పాటించడం జరిగింది.

గుమ్మడి హీరోగా జమున హీరోయిన్ గా ఒక సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి గుమ్మడి గారు హీరో పాత్రలు వస్తాయని పంచ కట్టుకోవడం మానేసి ప్యాంటు వేసుకొని తిరిగేవాడు. అప్పుడు గోపీచంద్ నువ్వు హీరోలకి తండ్రి, తాత అలాంటి పాత్రలకు బాగుంటావని చెప్పడంతో పిచ్చి పుల్లయ్య సినిమాలో పాత్రకి మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి హీరోలకి తండ్రిగా, తాతగా, మేనమామ గా గుండెపోటుతో చనిపోయే పాత్రలు ప్రేక్షకుల గుండెలుపిండేలా చేయడంతో.. దర్శకులు ఆ పాత్రలకు గుమ్మడినే ఎక్కువగా తీసుకునేవారు అలా గుమ్మడి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago