సామాజిక సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని సమాజంలో కుళ్లు కుతంత్రాలను కూకటివేళ్లతో పెకిలిస్తూ నవసమాజ స్థాపనలో భాగంగా టి.కృష్ణ కథలను రాసుకుంటూ సినిమాలు తీస్తున్న తరుణములో ఓ సామాజిక సంస్కరణ కథ అనుకొని రామోజీరావుని కలిశాడు. కానీ అంతకుముందే ఉషాకిరణ్ మూవీస్ వారి మయూరి సినిమా టి. కృష్ణ, పోకూరి బాబూరావు కి బాగా నచ్చింది. కావున ఉషాకిరణ్ మూవీస్ తో తీస్తే అంతకంటే మంచి సినిమా చేయాలనుకున్నారు.
రామోజీరావు గారి దగ్గర రెండు నెలల గడువు తీసుకొని… మరో కొత్త లేడీ ఓరియంటెడ్ కథతో వచ్చారు. అది రామోజీ రావు గారికి నచ్చడం తో సినిమా చేద్దామనుకున్నారు. మాదాల రంగారావు సినిమాలో పోకూరి బాబూరావు విజయశాంతిలు కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ లో విజయశాంతిని చూసిన టి.కృష్ణ తను తీయబోయే ప్రతిఘటన మూవీ లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు. విజయశాంతి కూడా టి కృష్ణ కొత్తవాడు కావడంతో మొదటగా ఆఫర్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ దర్శకుడు కృష్ణ ఇతర సినీ ప్రముఖులచే రికమండ్ చేయించగా విజయశాంతి చివరగా ఒప్పుకున్నారు.
ప్రతిఘటన సినిమాకి విజయశాంతి తరవాత అంతా ప్రధానమైన పాత్ర ప్రతి కథానాయకుడు. ఆ పాత్ర కోసం ఓ కొత్త వ్యక్తి కావాలని వెతికారు. ఆ క్రమంలో కన్నడంలో దాదాపు ఏడెనిమిది సినిమాలలో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నా చరణ్ రాజ్ ను టి.కృష్ణ ఎమ్.వి.ఎస్ హరనాధ రావు, సుత్తివేలు కలిశారు. వీరు కలిసే సమయానికి చరణ్ రాజుకు ముఖం పై మీసం, గడ్డం లేకపోవడంతో రూము నుండి బయటకు వచ్చినా హరనాధ రావు, సుత్తివేలు ప్రతిఘటన సినిమాలో ఈ మీసం లేనోడికి కాళి(విలన్) వేషమా అంటూ నవ్వారు.
సినిమా షూటింగ్ లో ఫస్ట్ డే వైజాగ్ లో రోడ్డుమీద చరణ్ రాజు విజయశాంతి ని ఉద్దేశించి చెప్పే డైలాగ్. చరణ్ రాజు ఎన్ని టేకులు తింటాడో.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సుత్తివేలు, హరనాథ్ రావులకు చెంప చెల్లుమనే లాగ ఒకే టేక్ లో చరణ్ రాజ్ డైలాగ్స్ చెప్పాడు. సినిమా యూనిట్ మొత్తం చప్పట్లు కొట్టారు. ఆ తరవాత సుత్తివేలు, హరనాధ రావు ఇద్దరు దర్శకుడు టి కృష్ణ కాళ్ళపై పడి విలన్ సెలక్షన్ బాగుందని పొగిడారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…