Featured

అలా.. వైకుంఠపురములో ఈ నటుడి భార్య, పిల్లలు మనకు బాగా తెలిసిన నటులే.. ఆమె ఒక స్టార్ హీరోయిన్ కుడా!!

అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ అసలు తండ్రి పాత్ర పోషించిన వ్యక్తి గురించి మీకు తెలుసా… ? ఆయన ఎవరు..? ఆయన ఇంతకు ముందు ఏ సినిమాల్లో నటించారు..? ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి…! ఇప్పుడు చూద్దామా…! అలా వైకుంఠపురంలో… సినిమాలో అల్లు అర్జున్ అసలు తండ్రి పోషించిన వ్యక్తి పేరు జయరామ్. అయితే ఈ సినిమాలో ఈయన నటన కు అందరూ ఫిదా అయ్యారు అని చెప్పవచ్చు. దానికి కారణం ఆ క్యారెక్టర్ ను అంతలా పండించాడు కాబట్టి.

అయితే ఈయన సినిమాల విషయానికొస్తే ఇంతవరకు జయరామ్ 200 సినిమాలకు పైగా నటించడం జరిగింది. ఆయన కేవలం సినిమా హీరోగానే మాత్రమే కాకుండా కామెడీ పండించడంలో కూడా దిట్ట. ఇకపోతే ఈయన నటించిన చిత్రం బాగా గుర్తు వచ్చేది అంటే పంచతంత్రం. ఇక ఆ సినిమాలో ఆయన చెప్పే డైలాగు ఇప్పటికీ అందరికీ గుర్తు ఉంటుంది. అదేమిటంటే… ” మా నాన్నకు హార్ట్ లో హోల్” . ఆ సినిమాలో జయరాం నటనకి నిజంగా ప్రతి ఒక్కరూ నవ్వు ఆపుకోలేక పోయారు. ఇకపోతే జయరాం నటుడే కాకుండా ఆయన సతీమణి కూడా టాప్ హీరోయిన్. ఈవిడ పేరు పార్వతి. ఆమె మలయాళం, తమిళ్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

ఈమె మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టగా కొన్ని రోజుల తర్వాత టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. అయితే వీరిద్దరు ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇలా నటించడం కాబోలు వారి సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లారు. ప్రస్తుతం వారికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇక కొడుకు పేరు కాళిదాస్ జయరాం. ఇదివరకూ తను చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. ఇక కూతురు పేరు మాళవిక జయరాం. ప్రస్తుతం ఈ అమ్మాయి మంచి మోడల్ గా రాణిస్తుంది. అలాగే చిన్నచిన్న యాడ్స్ లో కూడా నటిస్తూ త్వరలోనే సినిమాలలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago