ఆరాధన, ఆత్మబలం, అక్కచెల్లెలు, దసరాబుల్లోడు లాంటి చిత్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే బ్యానర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్. ఈ బ్యానర్ అధినేత అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ ఏఎన్నార్ తో అనేక చిత్రాలను రూపొందించారు. ఆ క్రమంలో మద్రాస్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న జగపతిబాబు సినిమాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. జగపతిబాబు తన విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం వైజాగ్ వెళ్లి వ్యాపారం చేసుకోవడం ప్రారంభించారు. అలాకొద్ది రోజుల అనంతరం తన తండ్రిగారికి తెలియకుండా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ విషయం మధ్యవర్తి ద్వారా తెలుసుకొని వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతిబాబు హీరోగా ఓచిత్రం తీయాలనుకున్నారు.
1989, జగపతి ఆర్ట్ పిక్చర్స్, మధుసూదన్ రావు దర్శకత్వంలో ‘సింహస్వప్నం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో జగపతి బాబు, వాణి విశ్వనాథ్, శాంతిప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు తన మొదటి చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ప్రధాన పాత్రలో కనిపించారు.
తర్వాత 1989,పల్లవిపూర్ణ పిక్చర్, పి.అనిల్ దర్శకత్వంలో ‘అడవిలో అభిమన్యుడు’చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో జగపతి బాబు, వినోద్ కుమార్, ఐశ్వర్య కలిసి నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం సగానికిపైగా అడవి నేపథ్యంలో కొనసాగుతోంది. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో జగపతిబాబు కొండలు, గుట్టలు ఎక్కడం నీళ్ళలో ఈదటం లాంటి కొన్ని కష్టమైన సీన్స్ లలో నటించాల్సివచ్చింది. అడవి నేపథ్యంలో వచ్చిన చిత్రం కాబట్టి సహజంగా అడవుల్లో చెట్లు, ముళ్ళ పొదలు ఉండడం, జనసంచారానికి అవకాశం ఉండక పోవడం లాంటి కారణాలతో షూటింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది
ఆ క్రమంలో జగపతి బాబు తండ్రి గారైన వి.బి.రాజేంద్రప్రసాద్ అడవిలో అభిమన్యుడు చిత్రీకరణ సమయంలో జగపతి బాబు కష్టాన్ని చూసి రోజు ఒక ‘హాఫ్ బాటిల్’ మందుని జగపతిబాబుకు పంపేవారని ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు చెప్పుకొచ్చారు. అలాగే ‘అంతపురం’ చిత్రంలో సారాయి వీర్రాజు పాత్రలో జగపతిబాబు నటించారు. ఆ సినిమాలో జగపతిబాబు చాలా యాంగ్రీగా, ఎమోషనల్ గా కనబడతారు. ఆ షూటింగ్ లో జగపతి బాబు ఆల్కహాల్ తీసుకొని ఓ సన్నివేశంలో నటించానని అదే ఇంటర్వ్యూలో ఆయన కొసమెరుపుగా చెప్పుకొచ్చారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…