Featured

‘ఇద్దరు మిత్రులు’గా వచ్చిన ఈ ఇద్దరి హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో తెలుసా..?

సాంఘిక చిత్రాల్లో కరుణరస పాత్రలకు పెట్టింది పేరు అక్కినేని నాగేశ్వరావని చెప్పుకోవచ్చు. 1960 దశకంలో బెంగాలీ నవలల ఆధారంగా కొన్ని తెలుగు సినిమాలు రావడం జరిగింది. సాధారణంగా తెలుగులో వచ్చిన పౌరాణిక చిత్రాలను బెంగాలీ వారు చూడటం, బెంగాలీ లో వచ్చిన సాంఘిక చిత్రాలను తెలుగువారు చూడటం అలవాటుగా ఉండేది.

ఎందుకంటే అంత భారీ మొత్తంలో పౌరాణిక చిత్రాలపై ఖర్చుపెట్టి రూపొందించడం కష్టం కనుక తెలుగునుంచి వచ్చిన పౌరాణిక చిత్రాలను బెంగాల్ లో ప్రదర్శించడం జరిగేది. ఆ విధంగా 1960లో దుక్కిపాటి మధుసూదనరావు కలకత్తా వెళ్లి అక్కడ ద్విపాత్రాభినయంతో ప్రదర్శిస్తున్న ఓ బెంగాలీ చిత్రాన్ని చూడటం జరిగింది.

ఇలాంటి ద్విపాత్రాభినయంతో తెలుగులో సినిమా తీస్తే బాగుంటుందని ఆయన బెంగాలీ చిత్రంలోని ద్విపాత్రాభినయంతో కూడిన సందర్భాన్ని తీసుకున్నారు కాని మళ్ళీ తెలుగులో కొత్తగా కథను రాసుకుని ఆ కథను నాగేశ్వరరావుకి వినిపించడంతో ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా 1961, అన్నపూర్ణ బ్యానర్, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, సరోజ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.

ఈ సినిమా విడుదలైన చాలా సంవత్సరాలకు.. చిరంజీవి కె.రాఘవేంద్రరావు, కాంబినేషన్ ‘మోసగాడు’ చిత్రంతో ప్రారంభమై తిరుగులేని మనిషి, కొండవీటి రాజా, అడవి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ముగ్గురు మొనగాళ్ళు, ఇద్దరుమిత్రులు, యుద్ధ భూమి, రుద్ర నేత్ర, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి చిత్రం ‘శ్రీ మంజునాథ’ వరకు ‌వీరి కాంబినేషన్ లో పరాజయాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా విజయవంతమైన సినిమాలే తీశారు. అలా 1999, చంటి అడ్డాల నిర్మాణం, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం విడుదలైంది.

ఈ సినిమాలో చిరంజీవి, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి సాక్షి శివానంద్ కలిసి నటించిన దృశ్యాలన్నీ “కుచ్ కుచ్ హోతా హై” చిత్రంలోని షారుక్, కాజల్ మధ్య వచ్చే సీన్స్ ను పోలి ఉంటాయి. అయితే సాక్షి శివానంద్, చిరంజీవితో రెండోసారి ఈ చిత్రంలో కలిసి నటించారు. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కు తగిన విధంగా ‘ఇద్దరు మిత్రులు’ సినిమా ఆడక పోయినా జస్ట్ హిట్ గా మాత్రం నిలిచిపోయింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

22 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

23 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago