Featured

తండ్రి బయోపిక్స్‌తో బాలయ్యకి గట్టి దెబ్బే తగిలింది.. ఇన్ని విమర్శలా..!

నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్.టి.ఆర్‌గా, అన్నగా ప్రజలకి ఎనలేని సేవ చేశారు. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఎన్నో అద్భుతమైన విషయాలు, విశేషాలు.. కోట్ల ప్రజలకి తెలియని విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. భాష ఏదైనా బయోపిక్ సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే మేకర్స్ అన్నీ ప్రధాన భాషలలో సినీ, రాజకీయ, క్రీడా కారుల జీవిత కథలను ఆధారంగా చేసుకొని కొంత కల్పితాన్ని జతచేసి కమర్షియల్ అంశాలను కలుపుకొని సినిమాగా మలిచి సక్సెస్ అందుకుంటున్నారు.

కమర్షియల్ సినిమాలలో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు కొన్ని పనికిమాలిన సన్నివేశాలు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులకి బయోపిక్స్ బాగా ఊరట కలిగిస్తున్నాయి. వాస్తవ సంఘటనలతో రూపొందించే సినిమాల మీద బాగా ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో దంగల్, సూపర్ 30, ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలు వచ్చి భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని కాసుల వర్షం కురిపించాయి. అలాగే తెలుగులో రక్త చరిత్ర, మహానటి సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక్కడ ఆర్జీవీ కూడా ఎక్కువగా వాస్తవ సంఘటనలతోనే సినిమాలు తీసి తిట్టించుకుంటూ, పొగిడించుకుంటున్నారు.

ఇదే క్రమంలో నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి సినీ, రాజకీయ జీవితాన్ని సినిమాగా రూపొందించాలనుకున్నారు. విజయవంతగా 99 సినిమాలు చేసిన బాలయ్య 100 వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను చేశారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య 100వ సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాలయ్య కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగానూ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతారని అందరూ భావించారు. కానీ 100కి ముందు ఎలాగైతే సినిమాలను కమిటయ్యారో ఆ తర్వాత కూడా అలాగే సినిమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే 101వ సినిమాగా పైసా వసూల్ 102వ సినిమాగా జై సింహా చేశారు. అలాగే తన తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయాలనుకున్నారు. సినిమాకి సంబందించిన కథను ఒక భాగంగా రాజకీయానికి సంబంధించిన కథను ఒక భాగంగా చేయాలనుకున్నారు. అలాగే ఎన్.టి.ఆర్. కథానాయకుడు, ఎన్.టి.ఆర్. మహానాయకుడు సినిమాలను 103, 104 గా చేశారు. ఈ రెండు భాగాల మీద ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ముందు తేజ దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్ట్‌కి ఆయన ఆదిలోనే తప్పుకొని క్రిష్ వచ్చి చేరారు.

ఇక మొదటి భాగం విడుదలైయ్యే సమయంలో అందరూ ఈ సినిమా గురించే చర్చించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య ఎన్.టి.ఆర్. కథానాయకుడు విడుదలయింది. కానీ సినిమాకి డివైడ్ టాక్ వచ్చి అభిమానులను బాగా డిసప్పాయింట్ చేసింది. ఆశించినంతగా ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. అంతా అతుకుల బొంతలా ఉందనే కామెంట్స్ వచ్చాయి.

దాంతో ఎన్.టి.ఆర్. మహానాయకుడు మీద ఫోకస్ పెట్టారు. ఓ నెలరోజుల వ్యవధిలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇది అదే పరిస్థితి. దాంతో బాలయ్య అనవసరంగా తండ్రి బయోపిక్ తీసి చెడగొట్టారని చెప్పుకున్నారు. కనీసం ఒక భాగం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం నిజంగా దురదృష్టకరమే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకున్నాయి. అసలు కథలో చెప్పాల్సిన అంశాలు చెప్పలేదని బాలయ్య అసలు సూటవలేదని.. ఇలా రక రకాలుగా చెప్పుకున్నారు. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago