Categories: FeaturedMovie News

అనుష్కను ఫాలో అయిన కీర్తి సురేష్..అందుకే ఫ్లాపులొస్తున్నాయా ..?

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో అక్కినేని నాగార్జున – సోనుసూద్ నటించిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. సినిమా ఇండస్ట్రీ మీద ఏమాత్రం అవగాహన లేకుండా వచ్చి ఆడిషన్ అంటే, ఫొటో షూట్ అంటే తెలుసుకోకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమాకి గ్లామర్ గా కనిపించాలంటే చాలా నెర్వెస్ గా ఫీలయి ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. చిన్న చిన్న డ్రెస్‌లు వేసుకొని 400 మంది ముందు నటించాలంటే చాలా ఇబ్బంది పడింది. ఇక మేకప్ టెస్ట్ చేయడానికి మేకప్ మ్యాన్.. అనుష్మ ముఖాన్ని కామెంట్ చేశాడు.

మొదటి సినిమా సూపర్ తర్వాత ఇక సినిమాలు వద్దనుకుంది. ఈ సినిమా తర్వాత తనకి ఇష్టమైన యోగా వృత్తిలోనే కొనసాగాలనుకుంది. కానీ ‘సూపర్’ సూపర్ డూపర్ హిట్ అయి అందరూ తనని మెచ్చుకోవడంతో ఇండస్ట్రీలో కొనసాగాలని డిసైడయింది. అప్పటి నుంచి కథ ఎలాంటిదైనా దానికోసం పూర్తి స్థాయిలో శ్రమించడం తనలో ఉన్న గొప్పతనం. ఒకసారి సినిమాకి కమిటయితే ఎలాంటి ప్రయోగం చేయాలన్నా ఏమాత్రం వెనకాడదు. అందుకే ఆమెకి అరుంధతి వంటి గొప్ప సినిమా చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమా అనుష్క క్రేజ్‌ను విపరీతంగా పెంచేసింది.

అరుంధతికి ముందు అరుంధతికి తర్వాత అన్నట్టుగా అనుష్క స్టార్ డం పెరిగింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి చక చకా సైన్ చేసేసి దెబ్బ తినింది. అన్నీ అరుంధతి సినిమాలా సూపర్ హిట్ కావు కదా. కానీ అనుష్క సైజ్ జీరో లాంటి సినిమాలు ఒప్పుకొని కెరీర్ మొత్తం చిక్కుల్లో పడేసుకుంది. దాంతో తనకంటే తర్వాత చచ్చిన వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. కానీ అనుష్క గత చిత్రం నిశ్శబ్ధం తర్వాత మళ్ళీ కొత్త సినిమా ప్రకటించలేదు.  

మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా ఇప్పుడు అనుష్కని ఫాలో అయిందని అందువల్లే తన కెరీర్ కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందుల్లో పడిందని చెప్పుకుంటున్నారు. మహానటి సినిమా కీర్తి సురేష్ కి మైల్ స్టోన్ మూవీ మాత్రమే కాదు. అప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ కాస్త మరోస్థాయికి చేరుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క మాదిరిగానే వరుసగా మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కమిటయింది. అంతేకాదు గత ఏడాది కరోనా వల్ల ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కాలేదు.

కానీ కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రముఖ ఓటీటీలో విడుదలై ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్నాయి. ప్రగ్నెంట్ లేడీ పాత్రలో ప్రయోగం చేసింది. చాలా శ్రమపడి ఈ పాత్ర చేసింది. కానీ ప్రేక్షకులని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ సినిమానే పెంగ్విన్. ఇక ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా అయితే మరీ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. చాలా చిన్న పాయింట్‌తో మిస్ ఇండియా సినిమా ఎలా తీశారని విమర్శలు వచ్చాయి. అంతేకాదు కీర్తికి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక ఈ సినిమాల కోసం బొద్దుగా ఉన్నది కాస్త సన్నగా పీలగా తయారైంది.

కీర్తిని ఇలా చూడటానికి అభిమానులే అంతగా ఇష్టపడలేదని టాక్ వినిపించింది. ఇక కమర్షియల్ సినిమాగా వచ్చిన రంగ్ దే హిట్ అనే టాక్ మొదటలో వచ్చినా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. పైగా కాస్త బొద్దుగా అవ్వాలంటూ అభిమానులు సలహాలిచ్చారు. అంతేకాదు సర్కారు వారి పాట సినిమా మొదలయ్యేసరికి కాస్త లావెక్కాలని మేకర్స్ సూచించారట. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ మహేష్ బాబుతో నటిస్తున్న సర్కారు వారి పాట మీదే ఉంది. చూడాలి మరి కీర్తి సురేష్ ఇప్పటి నుంచైనా ఎంచుకునే ప్రాజెక్ట్స్ ఆచితూచి ఎంచుకుందో లేదో.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago