Featured

వాస్తు లేని ఓ పాత బంగ్లాలో రాసుకున్న ఈ కథ.. కట్ చేస్తే ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.!!

దర్శకుడు బి.గోపాల్, బొబ్బిలిరాజా, లారీడ్రైవర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరో మోహన్ బాబు “అల్లుడుగారు” సినిమా విజయంతో మంచి స్వింగ్ లో ఉన్నారు. తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని చూసిన మోహన్ బాబు ఆ సినిమాను తెలుగులో తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ముందుగా దర్శకుడు బి.గోపాల్ కి ఆ వీడియో క్యాసెట్ ని చూపించారు. ఎందుకైనా మంచిది ఈ సినిమాని రచయితలు పరుచూరి బ్రదర్స్ కి చూపించమని మోహన్ బాబుకి చెప్పారు. వారికి నచ్చకపోతే ఈ సినిమా చేయరా.. మీరు అని మోహన్ బాబు బి.గోపాల్ ని అడిగారు. అలా కాదు ఒకసారి పరుచూరి బ్రదర్స్ కి చూపిస్తే బాగుంటుందని బి.గోపాల్ చెప్పారు.

పరుచూరి బ్రదర్స్ కి ఫోన్ చేస్తే ఎక్కడో షూటింగ్ లొకేషన్స్ లో ఉన్నారని చెప్పారు. ఆ తరువాత చెన్నై రావడంతో తమిళ ఒరిజినల్ సినిమాని మోహన్ బాబు పరుచూరి బ్రదర్స్ కి చూపించారు. సినిమా బాగుంది కానీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పరుచూరి గోపాలకృష్ణ చెప్పడంతో… మద్రాస్ టీనగర్, త్రిమూర్తి స్ట్రీట్ లో ఏ మాత్రం వాస్తు లేని ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ఒక “అల్లుడు గారు” తప్ప మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ లతో ఉన్నాయి.. అలాంటప్పుడు ఏమాత్రము వాస్తుకులేని ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకుంటున్నావు.. అని చెప్పినా కూడా మోహన్ బాబు అదే బంగ్లాలో ఒరిజినల్ తమిళ సినిమా కథను మార్పులు చేర్పులతో తిరిగి రాసుకోవడం జరిగింది. ఆ సినిమానే “అసెంబ్లీ రౌడీ”.

అలా కథ స్క్రీన్ ప్లే, సంభాషణలు వ్రాసుకున్న అనంతరం సినిమాకి సంబంధించిన నటవర్గం ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. మోహన్ బాబు కు జోడిగా ఎవరైతే బాగుంటుందనుకుంటున్న సందర్భంలో.. పరుచూరి బ్రదర్స్ దివ్యభారతిని పెట్టుకోమని సలహా ఇచ్చారు. అలా దివ్యభారతి సినిమాకి హీరోయిన్ గా ఎంపికైంది. మోహన్ బాబు కు తండ్రిగా ముందుగా రావుగోపాల్ రావును అనుకున్నప్పటికీ.. ఆయన నా వయసు మీద పడడంతో షూటింగుకి రావడం ఆలస్యం అవుతానని చెప్పడంతో.. ఆయన స్థానంలో కళావాచస్పతి జగ్గయ్యను తీసుకున్నారు. ఆ తర్వాత ఒకప్పుడు ఆయనతో హీరోయిన్ గా నటించిన అన్నపూర్ణను మోహన్ బాబుకి తల్లి పాత్రను చేయించడం జరిగింది.

చిత్తూరు జిల్లా, తిరుపతికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాలలో 41 రోజులు సినిమా షూటింగ్ చేశారు. షూటింగ్ ఉదయం 6 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగించేవారు. తర్వాత నటీనటులకు బ్రేక్ ఇచ్చి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు కు సినిమా షూటింగ్ జరిపారు. ఇక ఈ అసెంబ్లీ రౌడీ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలు ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు హైదరాబాదులో నిర్వహించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago