Featured

15 రోజులు కోమాలోనే ఉండిపోయా.. బ్రతకడమే కష్టం అన్నారు డాక్టర్లు.. : ముమైత్ ఖాన్

తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 143 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్వతాహాగా పాప్ సింగర్ అయిన మొమైత్ ఖాన్ దాదాపు 1500 కి పైగానే పాప్ సాంగ్స్ పాడింది. మొమైత్ ఖాన్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషా సినిమాలలో నటించారు. అంతేకాదు పాటు, ఝలక్ దిఖ్లా జా 6, బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ వంటి రియాలిటీ షోలలో ఆమె పోటీ పడింది. దాదాపు 40 తెలుగు సినిమాలు, 20 కి పైగా హిందీ సినిమాలు, 16 తమిళం, 5 కన్నడ సినిమాలలో మొమైత్ నటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన మున్నా భాయ్ ఎంబిబిఎస్ లో మొమైత్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ పోషించారు. ముంబై నుంచి తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తే హైదరాబాద్ చేరుకుంది. మొమైత్ ఖాన్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయో సాంగ్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఇలియానా జంటగా నటించిన పోకిరి సినిమాలోని ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’..అనే పాట. ఈ సాంగ్ ఆమెకి సౌత్ మొత్తంలో ఐటెం గర్ల్ గా భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. చాలా కాలం పూరితోనే ట్రావెల్ చేసింది మొమైత్.

టాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన మొమైత్ దాదాపు పదేళ్ల పాటు తన సత్తా చూపించింది. భారీ స్థాయిలో ఈమెకి క్రేజ్ దక్కింది. దాంతో మొమైత్ నే కథానాయికగా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. అలా కొన్ని సినిమాలలో మొమైత్ మెయిన్ లీడ్ లో నటించింది. అయితే మొమైత్ మాదక ద్రవ్యాల ఆరోపణల వివాదంతో ఆమె జీవిత తారుమారయింది. ఇందులో చాలా మంది దక్షిణ సినీ తారలను కూడా ప్రశ్నించారు. నిందితుడు కాల్విన్ మస్సెరెహాస్‌తో ఆమె సంబంధం కూడా దర్యాప్తు కేంద్రంలో ఉందని వార్తలు వచ్చాయి.

దాంతో జూలై 2018 లో, మొమైత్‌ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 నుండి మాదక ద్రవ్యాల రాకెట్‌కి సంబంధించి దర్యాప్తు బృందం ప్రశ్నించినందుకు దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన మరో 20 మంది వ్యక్తులు తొలగించారు. అయితే ఈ దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తానని అందరికంటే ముందు మొమైత్ ముందుకొచ్చింది. ఇక ఆమె విచారణ తర్వాత రియాలిటీ షోకి తిరిగి వచ్చింది. అంతగా మొమైత్ దేనికి భయపడకుండా ధైర్యంగా అడుగేస్తుంది. అయితే డిసెంబర్ 2016 లో, మొమైత్ మంచం పై నుండి పడి ఆమె తలకి గాయం అయింది. మెదడులోని నరాలు దెబ్బ తిన్నాయి. దాంతో మొమైత్ 15 రోజులు కోమాలో ఉంది.

ఇక చికిత్స, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి మెమోఇత్ కి కనీసం రెండేళ్ళు అయినా పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ఆ తర్వాత తనకి మూర్ఛలు వంటి కొన్ని నాడీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గత రెండేళ్లుగా కేవలం మందులతోనే బ్రతుకుతోంది. ఈ సమయంలో జిమ్‌కు కూడా దూరంగా ఉండమని తన పర్స్నల్ డాక్టర్ సలహా ఇవ్వడంతో జిమ్‌కు కూడా దూరంగా ఉంది. దాంతో మొమైత్ బాగా బరువు పెరిగింది. ఎన్నో ఇబ్బందులు పడీ ప్రాణాపాయ స్థితి నుంచి తిరిగి సాధారణం స్థితికి చేరుకుంది. ఈ ఏడాది ఆలీతో సరదాగా అనే కార్యక్రంలో పాల్గొన్న మొమైత్ ఈ విషయాలన్నీ ప్రేక్షకులతో పంచుకుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago