ఎస్పీ బాలసుబ్రమణ్యం తర్వాత మళ్లీ అటువంటి వాయిస్ అని అందరూ బాగా మెచ్చుకున్న సీనియర్ సింగర్ మనో( నాగూర్ బాబు). సింగర్ గా మనో మొత్తం 13 భాషల్లో 25 వేల పాటలు పాడారు. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌లో మరో 25 వేల పాటలు పాడారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మనోకి మంచి పేరుంది. గతకొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కి మనో డబ్బింగ్ చెబుతున్నారు. మనో (నాగూర్ బాబు) సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. మనో నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.
గాయకుడిగా పరిచయమవక ముందే ‘నీడ’ అనే సినిమాలో బాలనటుడిగా నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా నాగూర్ బాబు పేరును మనోగా మార్చాడు. మనో అన్నయ్య తబలా వాయించేవారు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళారు. మనో – మనో వాళ్ళ అన్నయ్య ప్రతిభను గుర్తించిన చక్రవర్తి ఇద్దరినీ అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. అలా నేపథ్య గానంలో మెళకువలు తెలుసుకున్నారు. చాలాకాలం తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా పాటలు పాడారు. సింగర్ గా మనో పాడిన మొదటి పాట మురళీ మోహన్, జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమాలో.
సింగర్ గా మనో చాలా వైవిధ్యమైన గాత్రంతో పాటలు పాడగలరు. అందుకు ఉదాహరణ ప్రేమికుడు సినిమాలోని ముక్కాలా ముక్కాబులానే. ఈ పాట కోసం మనో రాత్రంతా రక రకాల వాయిస్‌లు ట్రై చేసి ఫైనల్‌గా ఆర్‌డి.బర్మన్ పాట విని ఆ స్టైల్లో పాడి సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ని మెప్పించారు. హరిశ్చంద్ర పద్యాలు మనో చాలా అద్భుతంగా పాడతారు. మనోని బాలుతో పాటు చాలామంది హరిశ్చంద్ర పద్యాలు ఎంతో ఇష్టంగా పాడించుకుంటారు. అయితే గత కొంతకాలంగా మనోకి సినిమాలలో పాటలు పాడే అవకాశం దక్కడం లేదు.
అందుకు కారణం కొత్త కొత్త సింగర్స్ రావడమే. అందుకే ఆయనకి అవకాశాలు తగ్గాయి. ఇది ఆయన మాత్రమే పాడాలి అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ తప్ప మిగతావాళ్ళు మనోతో పాడించడం లేదు. అయితే బుల్లితెర మీద మాత్రం పలు షోస్ తో బిజీగా ఉంటున్నారు. చాలాకాలం తర్వాత మనో మళ్లీ నటుడిగా కనిపించబోతున్నారు. మనోకి స్క్రీన్ మీద కనిపించడం చాలా ఇష్టం. కానీ సింగర్ గా ఉన్నప్పుడు ఇలా నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుల్లితెర యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీముఖి ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. ఈ పాత్ర మెచ్చితే మనో మరిన్ని పాత్రలు చేయడానికి రెడీ అంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…