దిల్ రాజు.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే.. ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే.. తెలుగులో బడా నిర్మాత. ఎన్నో మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకుల వద్దకు చేరుకోవడంలో ఆయన పాత్ర మరువలేనిది. దిల్ సినిమాతో ఆయన ఫేట్ మారిపోవడంతో ఆయన పేరు ముందు దిల్ రాజు వచ్చేసింది.
నిజానికి.. దిల్ రాజు పూర్తి పేరు ఏంటో తెలుసా? వెంకట రమణా రెడ్డి. కానీ.. చిన్నప్పటి నుంచి ఆయన్ను రాజు రాజు అని పిలిచేవారట. రాజు.. చిన్నప్పుడు ముద్దుగా ఉండేవారట. ముద్దు పేరు కాస్త స్కూల్ లో కూడా అందరూ రాజు అని పిలిచే వారట. లేదంటే వెంకట్ అని పిలిచేవారట. ఇక.. తన మొదటి సినిమా దిల్ సూపర్ హిట్ అవ్వడంతో తన పేరు దిల్ రాజుగా ఫిక్స్ అయిపోయిందట.
నువ్వు బాగుంటావు.. హీరో అవమని చాలామంది చెప్పారు
నిజానికి దిల్ రాజు అందంగానే ఉంటాడు కాబట్టి.. చాలామంది తన ఫ్రెండ్స్ నువ్వు హీరో అవ్వమని చెప్పారట. కానీ.. తనకు డిస్ట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారట. కానీ.. తనను నటించాలంటూ చాలామంది ప్రోత్సహించారట. కానీ.. తను మాత్రం నటనలోకి వెళ్లకుండా.. డిస్ట్రిబ్యూషన్ తో పాటు నిర్మాణ పనులు చూసుకోవడం మొదలు పెట్టారట దిల్ రాజు.
నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా.. అనే సినిమాలకు థియేటర్లు దొరకలేదు
నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా సినిమాలకు నాకు థియేటర్లు దొరకలేదు. వేరే వాళ్లకు వెళ్లేది ఆ సినిమాల డిస్ట్రిబ్యూషన్ మాకు వచ్చింది. అందుకే.. మా సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేశారు. అయినప్పటికీ.. ఏదో ఒకటి చేసి ఆ సినిమాలను రిలీజ్ చేశాం. ఇలా.. ఎన్ని సినిమాలకు థియేటర్ల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మేమే థియేటర్లు తీసుకుందామని అనుకొని.. థియేటర్లు తీసుకున్నాం. అందుకే.. థియేటర్లు తీసుకోవాల్సి వచ్చింది కానీ.. అదేదో బిజినెస్ కోసం మాత్రం థియేటర్లను తీసుకోలేదు అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో మన ముందు ఒకలా.. మన వెనుక ఇంకోలా మాట్లాడుతారు
ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు పెద్దలు కూడా మన ముందు ఒకలా మాట్లాడుతారు.. మన వెనుక ఇంకోలా మాట్లాడుతారు. మన ముందు పొగిడి.. మనం వెళ్లిపోగానే.. మనల్ని తిడుతారు. ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. మనం కూడా అలాగే బతకాలి. లేకపోతే కష్టం బతకలేం.. అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
అలాగే.. ఇండస్ట్రీని కొందరే శాసిస్తున్నారని.. వాళ్ల దగ్గరే ఎక్కువగా థియేటర్లు పెట్టుకున్నారని.. కొందరు ప్రొడ్యూసర్ల దగ్గరే 80 శాతం థియేటర్లు ఉండటం వల్ల.. వేరే వాళ్లకు, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకాలంటే చాలా కష్టం అవుతోందని దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తాము కూడా థియేటర్లను కొన్నింటిని కొనాల్సి వచ్చిందని చెప్పారు దిల్ రాజు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…