స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చి ఇండస్ట్రీని ఏలిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నే చూసుకోవచ్చు. అయితే మన టాలీవుడ్‌లో మాత్రం ఇది అంతగా వర్కౌట్ అవలేదు. ఇక్కడ చిన్న స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటింది చాలా అంటే చాలా తక్కువ. ముందు దర్శక, నిర్మాతలకే ఓ నెగిటివ్ సెన్స్ ఉంటుంది. చిన్న స్క్రీన్ మీద పాపులర్ అయిన వాళ్ళని సినిమాలకి తీసుకుంటే జనాలలో అంతగా క్రేజ్ ఉండదని ఆ ప్రభావమే సినిమా మీద పడుతుందని భావిస్తుంటారు. అవసరమైతే ఏ టాలెంట్ లేకపోయినా ముంబై నుంచి మోడల్ ని తీసుకు వచ్చి మరీ అవకాశాలిస్తారు.
కానీ మన దగ్గర చిన్న స్క్రీన్ మీద పాపులారిటీ ఉన్న నటీ నటులను తీసుకోవాలంటే మాత్రం బాగా ఆలోచిస్తారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ రోల్స్ కి స్మాల్ స్క్రీన్ వాళ్లని తీసుకోవడాని అంతగా ఇష్టపడరు. అయితే హీరోయిన్‌గా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనసూయ బాగా సత్తా చాటుతోంది. సీనియర్ హీరోయిన్స్ రాశిలాంటి వారు చేయాల్సిన పాత్రలను అనసూయ దక్కించుకుంటోంది. అంతేకాదు సినిమాలలో తను పోషించే పాత్రలకి మంచి పేరు కూడా వస్తోంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక్క అనసూయ మాత్రమే స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్ కి వచ్చి మంచి పాత్రలను దక్కించుకుంటోంది.
ప్రస్తుతం అనసూయ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఖిలాడి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న మరాఠి హిట్ సినిమా నట సామ్రాట్ తెలుగు రీమేక్ రంగ మార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. మరికొన్ని సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే అనసూయ అన్నీ పాత్రలను ఒప్పుకోవడం లేదు. తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకునే పనేది చేయకుండా జాగ్రత్తపడుతూ పాత్రలను ఒప్పుకుంటోంది. అయితే రష్మీ గౌతం మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా రాణించలేకపోతోంది. ఆమెకి అభిమానులు బాగా ఉన్నారు.
తనకి మంచి క్రేజ్ కూడా ఉంది. పాత్ర డిమాండ్ చేస్తే లిప్ కిసెస్ ఇవ్వడానికి రెడీ. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్నీ క్వాలిటీస్ రష్మీలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఘాటు ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది. ఈ సినిమా రష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమెకి ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు. ఎక్కడ రష్మీలో మైనస్ ఉంది..ఎందుకు తనకి హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదనేది అభిమానుల సందేహం. అయితే రష్మీ బుల్లితెర మీద షోస్ చేస్తూ చాలా బిజీగా ఉంది.
ఇక్కడ ఆమెకి వచ్చే రెమ్యునరేషన్ భారీగానే ఉంది. కానీ సినిమా అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చేంత కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకోకనే రష్మీ సినిమాలకి కమిటవడం లేదట. సినిమా అవకాశం అయినా తగ్గ రెమ్యునరేషన్ రానప్పుడు చేసి ఏం లాభం అనేది రష్మీ వర్షన్. పోనీ స్టార్ హీరో సినిమా..ఆ తార్వాత మంచి క్రేజి ఆఫర్స్ వస్తాయనుకుంటే కాంప్రమైజ్ అయి చేసినా పర్లేదు. కానీ వచ్చేవి అలాంటి ఆఫర్స్ కాదు. అలాంటప్పుడు ఎందుకు కాంప్రమైజ్ కావాలని అంటోందట. మంచి రెమ్యునరేషన్ ఇస్తే సినిమా చేయడానికి ఆమె రెడీనే. కానీ అలా ఇవ్వడం లేదు కాబట్టి సినిమాలు ఒప్పుకోవడం లేదట. ఒక సినిమా చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉండాలి..లేదా ఆత్మ సంతృప్తి అయినా ఉండాలి. ఇదీ రష్మీ నమ్మేది. కష్టపడి ఇంత క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళెవరైనా రష్మీ లానే మాట్లడతారు. అందులో తప్పేమి లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…