కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సినిమాల కారణంగా పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. అందుకు కారణం ఆమె ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్ళి రద్దు చేసుకోవడమే. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో పుట్టింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఎం.ఎస్.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో స్థానం సంపాదించింది రష్మిక మందన్న. అంతేకాదు 2016లో 24వ స్థానం లభించగా, 2017లో మొదటి స్థానంలో నిలిచింది.
దాంతో బాగా పాపులారిటీ సాధించింది. 2014 లో రష్మిక మందన్న మోడలింగ్ రంగంలో ఎంటరైంది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్నడ చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతల దృష్ఠిని ఆకర్షించింది. అలా కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రి ఇచ్చింది. ఆ చిత్రంలోని రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే డెబ్యూ మూవీ చేస్తున్న సమయంలోనే సహ నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఇక మొదటి సినిమా తరువాత రష్మికకు పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించే అవకాశాలు వరుసగా దక్కాయి. అంతేకాదు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్యతో కలసి ఛలో సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని, నితిన్ ల సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. టాలీవుడ్ లో రష్మిక నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి భారీ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే 5 భాషలలో క్రేజ్ ఊహించనంతగా పెరిగిపోతుంది. కాగా ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ లో మూడు సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కూతురిగా గుడ్ బై సినిమా, అలాగే సిద్దార్థ్ మల్‌హోత్రాకి జంటగా మిషన్ మజ్ఞు సినిమాలు చేస్తుండగా మరో క్రేజీ ఆఫర్ ని దక్కించుకుంది. ఇక కోలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి కార్తి సరన సుల్తాన్ సినిమా చేసింది. తమిళంలో కూడా రష్మికకి బాగా క్రేజ్ పెరిగింది.
అయితే ఈ కన్నడ బ్యూటీ ముందే ఈ సక్సెస్ పసిగట్టింది. మొదటి సినిమా కిరాక్ పార్టీ తర్వాత వరుసగా మూడు సినిమాలలో అవకాశం దక్కడంతో ఖచ్చితంగా తాను స్టార్ హీరోయిన్ అవుతాననే గట్టి నమ్మకం కలిగి జులై 2017లో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది. ఒకవేళ ఆ సమయంలో గనక రష్మిక పెళ్ళి చేసుకొని ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎంతమాత్రం ఉండేది కాదు. పెళ్ళి తర్వాత పరిస్థితులు మారిపోతాయని ముందే గ్రహించింది. ఇది సినిమా కెరీర్ కి ప్లస్ అయినా పీటలవరకు వచ్చిన పెళ్ళిని పెటాకులు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…