అనాటి అగ్ర నటుడు రావు గోపాల రావు కూడా నటుడు కాకపోయింటే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో మరో రకంగా అగ్ర స్థానంలో ఉండేవారు. రావు గోపాలరావు జనవరి 14, 1937 కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో పుట్టారు. 1966లో హరికథ కళాకారిణి అయిన రావు కమలకుమారిని వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు. తరవాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు, ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్ళి చేసుకున్నారు.
రావు గోపాలరావు సాధించిన విజయాలకి ఆయన భార్య అందించిన సహాయ సహకారాలే ప్రధాన కారణం. అంతేకాదు ఆయన కమలకుమారిని చేసుకోడం అదృష్ఠం.. అని చెప్పుకుంటుండేవారు. రావు గోపాలరావు నట జీవితం ముత్యాల ముగ్గు సినిమా లేకపోతే ఆయన లేరనే మాట ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ సినిమా వల్ల ఆయన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో ముత్యాల ముగ్గు సినిమాలోని రావు గోపాలరావు డైలాగులు అంతటా మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించడం ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.
ఇక రాజనాల తర్వాత తెలుగు సినిమాలలో విలనిజంలోనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా రావు గోపాలరావులా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరొకరు చేయలేరు. ఆ డైలాగ్ మాడ్యులేషనే యూనిక్. వేటగాడు సినిమాలో ఆయన యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి సినిమాలలో రావు గోపాలరావు నట విశ్వరూపం కనిపిస్తుంది.
రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ‘కీర్తిశేషులు’ నాటకంలోని పాత్రతో పాపులరిటీ తెచ్చుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు వేశారు. నాటక రంగం నుంచి వారు గొప్ప నటులు, మహా నటులు అవుతారనడానికి అతి పెద్ద ఉదాహణగా రావు గోపాలరావు నిలిచారు. 1966లో గుత్తా రామినీడు దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన సినిమాలో ఎస్.వి. రంగారావు, శ్రీనాథుని పాత్ర పోషించారు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేషం ఉంటుంది. ఎవరికిపడితే వారికి దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావును మద్రాసు పిలిపించి, రామినీడుకి పరిచయంచేసి ఆయనతో రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టారు.
అలా రావు గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామినీడు ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో రామినీడు వద్ద బంగారు సంకెళ్ళు, మూగప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసారు రావు గోపాలరావు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ, కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావుకు 1969 వచ్చిన జగత్ కిలాడీలు సినిమాలో ప్రధాన విలన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన గండర గండడు సినిమాలో నటించారు. ఇదే క్రమంలో బాపు-రమణలు 1975లో రూపొందించిన ముత్యాలముగ్గు సినిమాలో గోపాలరావు గోదావరి యాసలో విలక్షణమైన పాత్రలో విలన్ గా నటించి ప్రత్యేకతను చాటుకున్నారు.
అయితే రావు గోపాలరావు నటుడిగా మారకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శకుడయ్యేవారు. ఆయనకి చిత్ర నిర్మాణం, దర్శకత్వం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఏం చేసిన పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకునే రావు గోపాలరావు కొన్నిసార్లు దర్శకత్వం వహించాలనుకొని విరమించుకున్నారు. అయితే నిర్మాతగా హిట్ సినిమాలను నిర్మించాలనే కోరికను మాత్రం నెరవేర్చుకున్నారు. సహ నిర్మాతగా రావు గోపాలరావు స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవ రాముడు, వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఒక్క సినిమా అయినా దర్శకత్వం వహించాలనే రావు గోపాలరావు కోరిక మాత్రం తీరనే లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…