Featured

ఎన్టీఆర్ కు మనవరాలిగా తర్వాత ఆయనకు జోడిగా నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.?!

తెలుగు సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ.రామారావు ధరించిన పాత్రలు కోకొల్లలు. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవైనా తన పాత్రలతో ఆ సినిమాకి పేరు తెచ్చేవారు. ఆయన ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు. సావిత్రి, జమున, షావుకారు జానకి, కృష్ణకుమారి, అంజలి, రాజశ్రీ, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, లక్ష్మి, మంజుల, సుజాత లాంటి ఎంతో మంది హీరోయిన్స్ తో ఆయన జత కట్టారు.

అలాగే ఎన్టీ.రామారావుకి కూతురిగా మనవరాలిగా నటించి తిరిగి ఆయన ప్రక్కన జోడీగా చేసిన వారు అందాలతార శ్రీదేవి గా చెప్పుకోవచ్చు. 1972, త్రివేణి ప్రొడక్షన్స్, పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘బడి పంతులు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎన్టీరామారావు, అంజలి ప్రధాన పాత్రలో నటించారు. కృష్ణంరాజు, విజయ లలిత, రామకృష్ణ, జగ్గయ్య, నాగభూషణం ఇతర పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాలో ఎన్టీ.రామారావుకి మనవరాలిగా శ్రీదేవి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత శ్రీదేవి తెలుగు, తమిళ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించారు. తెలుగులో ‘అనురాగాలు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీదేవి.. బంగారక్క, ఆ తర్వాత చేసిన ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ గా రాణించారు.

ఆ తర్వాత ఏడు సంవత్సరాల వ్యవధిలో తిరిగి ‌1979లో రోజామూవీస్, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘వేటగాడు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఎన్.టి రామారావు, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. పూర్తిగా కమర్షియల్ హంగులతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ రోజుల్లో మనవరాలి వయసున్న శ్రీదేవితో ఎన్టీఆర్ చిందులు వేయడం ఏమిటని.. రూమర్స్ వచ్చినప్పటికీ అవి ఏవి పట్టించుకోకుండా, దర్శకుడు రాఘవేంద్రరావు.. ఎన్టీరామారావు, శ్రీదేవి తో “ఆకు చాటు పిందె తడిసే..కొమ్మ చాటు పువ్వు తడిసే..” లాంటి డ్యూయెట్ సాంగ్ పెట్టారు. ఈ పాట ఆ రోజుల్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. చక్రవర్తి అందించిన బాణీలు ‘వేటగాడు’ చిత్రాన్ని విజయపథం వైపు నడిపించాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago