Featured

అవినీతి ముఖ్యమంత్రి కుర్చీ కూసాలను కదిలించిన సినిమా ఏది.?!

సామాజిక అంశాలపై సినీ పరిశ్రమలో అనేక సినిమాలు రూపొందాయి. అందులో ఒక్కో సినిమా ఒక్కో సామాజిక సమస్యను ఇతివృత్తంగా చేసుకొని నిర్మించి సమాజంలో పేరుకుపోయిన కుళ్లు కుతంత్రాలను కూకటివేళ్లతో పెకలించి న ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. అలా రాజకీయ అంశాన్ని నేపథ్యంగా చేసుకొని వచ్చిన సినిమాలు కూడా అత్యంత ఘన విజయాన్ని సాధించాయి.

తమిళ దర్శకుడు శంకర్ సోషల్ ఎలిమెంట్స్ తో వచ్చిన సినిమాలు సొసైటీలో చాలా మార్పును తీసుకు వచ్చాయి. అలా 1999లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా కుహన రాజకీయాల పై శంకర్ సంధించిన రామభాణం గా పేర్కొనవచ్చు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా అందాల నటి మనిషా కొయిరాల హీరోయిన్ గా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా అప్పటి వరకు వచ్చిన ఎన్నో రాజకీయ చిత్రాలకు భిన్నంగా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి తో ప్రత్యేక ఇంటర్వ్యూ లో అతను చేసే అవినీతి అక్రమాలపై అర్జున్ సంధించే ప్రశ్నలకు రఘువరన్ కి ముచ్చెమటలు పడతాయి. పైగా అర్జున్ సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రి అవినీతిని బయటపెడతాడు. అలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగి చివరికి రఘువరన్ ఒక రోజు ముఖ్యమంత్రి గా ఉంటే ఆ కుర్చీ ఎలాంటిదో నీకు తెలుస్తుందని అర్జున్ ని అడగడంతో.. ఒక రోజు ముఖ్యమంత్రి గా ఉండడానికి అర్జున్ అంగీకరించడం జరుగుతుంది.

అలా హీరో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రి గా పదవిలో కొనసాగి రాష్ట్రంలో అవినీతి లంచగొండితనంపై యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో పెను మార్పులకు శ్రీకారం చుడతాడు. ఎన్నో సంవత్సరాలుగా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు తీసుకొని సత్వర నిర్ణయాలను ఒక్క రోజులో తీసుకొని ప్రజా సమస్యలను వారి ఇబ్బందులను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి ఎంతగానో నచ్చుతుంది.

డైరెక్టర్ శంకర్ కథాబలం, యాక్షన్ కింగ్ అర్జున్ నటన, మనిషా కొయిరాలా అందాలు, ఏ.ఆర్.రెహమాన్ అందించిన అద్భుతమైన పాటలు ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచిన తెలుగు ప్రేక్షకులు ఆ స్మృతులను ఇంకా మరిచిపోలేకపోతున్నారు.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago