Featured

నా చిన్నప్పుడు అతడు అంటే నాకు చాలా ఇష్టం అంటున్న శివాత్మిక..!!

జీవితా రాజశేఖర్ అనగానే ఆనాటి ఆహుతి తలంబ్రాలు అంకుశం సినిమాలు గుర్తుకువస్తూంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తలంబ్రాలు సినిమా షూటింగ్ సమయంలో జీవిత రాజశేఖర్ కి ప్రపోజ్ చేయగా ఆయన ఒప్పుకోలేదు. కానీ జీవిత పై ఉన్న ఇష్టంతో చివరికి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు.

జీవిత రాజశేఖర్ కి పెళ్లి తర్వాత శివానీ శివాత్మిక అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు. పెద్దమ్మాయి శివాని మెడిసిన్స్ చదువుతుండగా చిన్నమ్మాయి ప్లస్ టు కంప్లీట్ చేసింది. అదే సమయంలో దర్శకుడు మహేంద్ర తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ నీ మూడు గంటల పాటు చెప్పడం జరిగింది. శివాత్మిక కు చిన్నప్పటినుంచి నటన పై ఇష్టం ఉన్నప్పటికీ తాను ముందుగా మెడిసిన్ పూర్తి చేయాలనుకుంది.
అయితే దర్శకుడు మహేంద్ర చెప్పిన ప్రేమకథ శివాత్మిక కుటుంబంలో అందరికీ నచ్చేసింది. అయితే శివాత్మికను ఏ విధంగా ఏ హీరోతో లాంచ్ చేయాలని ప్రత్యేకమైన ఆలోచన ఏమీ లేనప్పటికీ కథ నచ్చడంతో ఎలాగైనా సినిమా చేద్దామని నిర్ణయానికి జీవిత రాజశేఖర్ లు రావడం జరిగింది.

జీవితా రాజశేఖర్ లకు శివానీ శివాత్మిక ఇద్దరు చాలా ఇష్టం. దాదాపు శివాత్మిక తన పేరెంట్స్ ని ఎప్పుడు వదిలి పెట్టి ఉండలేదు. కానీ శివాత్మిక దొరసాని సినిమా రాజశేఖర్ కల్కి మూవీ ఒకేసారి ప్రారంభం కావడం జరిగింది. ఆ క్రమంలో జీవిత ఒకటి రెండు సార్లు కోదాడ ప్రాంతానికి వెళ్లి షూటింగ్ లో శివాత్మిక కు సపోర్ట్ గా ఉంది. కానీ ఒక సందర్భంలో శివాత్మిక దాదాపు 25 రోజుల పాటు తన పేరెంట్స్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా తెలంగాణ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేసుకుని దొరసాని సినిమా విడుదలైంది.

అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక తన చిన్నప్పుడు మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఇష్టమని అలాగే పెద్దయ్యాక ఎన్టీఆర్ బృందావనం, విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తర్వాత కేరాఫ్ కంచరపాలెం లాంటి అనేక సినిమాలు బాగున్నాయని తనకు హీరోలకంటే సినిమాలే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago