Featured

చిన్నాకి నటనే రాదు ఆయనకు సినిమాలో అవకాశం ఇవ్వొద్దన్న డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా..??

నెల్లూరు జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి (చిన్నా) సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ వెళ్లడం జరిగింది. అక్కడ 1986-87 మధ్యకాలంలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకొని తిరిగి చెన్నై వెళ్లిపోయారు. అవకాశాల కోసం ప్రతి దర్శకుని దగ్గరికి తన ఫోటో ఆల్బమ్ తో వెళ్ళారు. చాలా చోట్ల అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా మధుసూదన్ రావు దర్శకత్వంలో జయసుధ, శరత్ బాబు నటించిన ‘ఆత్మకథ’ చిత్రంలో చిన్న వేషం వేయడం జరిగింది.

అదే సమయంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అంకుశం సినిమాలో ఒక వేషం ధరించడం జరిగింది. ఆ సినిమాలో నటించే సమయంలో చిన్న చాలా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కున్నాడు. ఆ తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు అన్నపూర్ణ ఆఫీసులో ఎవరో కొత్త సినిమా నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పడంతో నటుడు చిన్న అక్కడికి వెళ్లారు. రాంగోపాల్ వర్మ, శివ నాగేశ్వరరావు ఇద్దరూ అక్కడే ఉన్నారు. నీకు నచ్చిన ఏదైనా ఒక సీన్ చేసి చూపించమని వారు అడిగారు.

అప్పుడు చిన్న యాక్ట్ చేసి చూపించడంతో.. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఏదో ఒక సీన్ బట్టి పట్టి చేసి చూపిస్తున్నాడు.. అంతేగాని ఆయనకు నటన రాదని, ఆయన శివ సినిమాలోకి తీసుకుంటే ఆ క్యారెక్టర్ ని చెడగొడతాడని నాగేశ్వరరావు, రాంగోపాల్ వర్మ కి చెప్పిన కూడా ఫైవ్ డేస్ తర్వాత హైదరాబాద్ వచ్చి తనను కలవమని చిన్నతో రాము అన్నాడు. రాంగోపాల్ వర్మ చెప్పినట్టుగానే ఫైవ్ డేస్ తర్వాత నటుడు చిన్నా హైదరాబాద్ వెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో రాముని కలవడం జరిగింది అలా.. చిన్నా పై కొన్ని వీడియో రిహార్సల్స్ చేయడం జరిగింది. అప్పుడు రాంగోపాల్ వర్మకి బాగా నచ్చడంతో నాగర్జున స్నేహితునిగా శివ సినిమాలో ఒక పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో వేసిన ఆ పాత్ర చిన్నాకి ఎంతగానో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘పుట్టింటి పట్టుచీర’ సినిమాలో యమున కి తమ్ముడిగా నటించే మంచి పాత్రను నటుడు చిన్న వేయడం జరిగింది.

అయితే శివ సినిమాలో చిన్నా బాగా చేయడంతో నాగేశ్వరరావు చిన్నాకి సారీ చెప్పడం జరిగింది. తాను రిజెక్ట్ చేసిన కొందరిలో సక్సెసైన ఒకే ఒకడివి నువ్వేనని చిన్నాని అభినందించడం జరిగింది. ఆ తర్వాత నటుడు చిన్నా ‘మనీ’ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని శివ నాగేశ్వరరావుకు ఇచ్చారు. ఆ తర్వాత మధురారానగరిలో, మనీ మనీ, ఆంటీ, అల్లరి పిల్ల లాంటి అనేక చిత్రాల్లో నటించి… ఈ మధ్యకాలంలో ఆ ఇంట్లో అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. నవ్విన నాపచేనే నవరత్నాలు పండించిందనడానికి చిన్నా సినీ జీవితమే ఒక చక్కటి ఉదాహరణ..!!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి రోజే విషాదం.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి తిరిగి రాని వధువు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…

2 hours ago

రిజెక్ట్ చేశారని కుంగిపోకండి.. పూరి జగన్నాథ్ సూపర్ మెసేజ్ వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…

2 hours ago

కేసుతో విసిగిపోయిన జడ్జి.. 2046కి వాయిదా! తర్వాత షాకింగ్ ట్విస్ట్

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…

2 hours ago

కొబ్బరికాయ కుళ్లిపోయింది.. సినిమా ఆగిపోయింది! బాలయ్య మూవీపై సముద్ర షాకింగ్ కామెంట్స్

దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…

2 hours ago

‘హనుమాన్’ మిస్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు పశ్చాత్తాపం!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…

2 hours ago

తల్లి కోసం తండ్రిని చంపిన కుమారుడు.. కడపలో షాకింగ్ ఘటన!

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…

3 hours ago