మన టాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించాలని బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు అనుకున్న క్రేజ్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇక అక్కడ వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి హిందీ సినిమాలు చేయాలనుకున్నారు. కానీ వరుసగా మాత్రం చేయలేకపోయారు. నాగార్జున కూడా హిందీ జనాలకి బాగానే సుపరిచితుడు. కానీ హిందీ సినిమాలలో నటించాలంటే సాధ్యపడలేదు. అక్కడ స్ట్రైట్ సినిమాలు చేయాలనుకున్న మన టాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదు.
ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అంటూ బహుభాషా చిత్రాలను నిర్మిస్తున్నారు. సౌత్ కంటే నార్త్‌లోని హింది ఇండస్ట్రీకే మార్కెట్ ఎక్కువ. అందుకే హిందీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. కానీ మన సౌత్ సినిమాలు మాత్రం ఆయా భాషాలలో బెల్ట్ బెల్ట్ విడుదలవుతూ మిగతా భాషలలో డబ్ చేస్తున్నారు. హిందీలో కూడా మన హీరోలు నటించిన సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ గా వచ్చినవి అక్కడ డబ్ చేసి వదులుతున్నారు. హిందీలో ఎక్కువ ఫైట్స్ ఉన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు.
అందుకే ప్రభాస్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన యాక్షన్ సినిమాలను హిందీ వర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. డబ్బింగ్ వర్షన్ కి బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. కానీ బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా అంటే మాత్రం అంతగా ధైర్యం చేసి అడుగు వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆర్, మంచు ఫ్యామిలీ హీరోలు హిందీలో స్ట్రైట్ సినిమా చేయాలనే ఆసక్తి చూపించలేదు. కానీ నాగార్జున మాత్రం హిందీలో నటించడానికి ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర లో కీలక పాత్ర పోషించారు. ఆయన తనయుడు టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య కూడా ఆమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మొదటిసారి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ వర్షన్ మాత్రమే రిలీజయ్యాయి. అయితే బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ బెల్ట్‌లో ప్రభాస్‌కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దాంతో సాహో సినిమా అన్నీ భాషలలో నిరాశ పరచినా హిందీలో మాత్రం 150 కోట్ల వసూళ్ళు రాబట్టడం ఆసక్తికరం.
అందుకే ఆదిపురుష్ అనే సినిమాతో ప్రభాస్ బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాలీవుడ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్‌తో అడుగు పెడుతున్నాడు. అయితే ఈ హీరోకి టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఒక్క రాక్షసుడు తప్ప మిగతావన్ని ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. మరి హిందీలో ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి. నాని, శర్వానంద్ లాంటి వాళ్ళ సినిమాలు హిందీలో డబ్ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్, పుష్ప తర్వాత అల్లు అర్జున్, ఛత్రపతి రీమేక్ తర్వాత బెల్లంకొండ హీరో, లాల్ సింగ్ చద్దా తర్వాత నాగ చైతన్య హిందీ ఇండస్ట్రీలో ఏమేరకు నిలబడతారో ఓ క్లారిటీ వస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…