Featured

విజయశాంతి ఇమేజ్ వలనే నిప్పురవ్వ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందా.?!

నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడు బాలకృష్ణ సినిమాకోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీనివాస ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బాలకృష్ణ సహ నిర్మాతగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో నిప్పురవ్వ సినిమా 1991 సెప్టెంబర్ 11న మద్రాసులోని ఏ.వి.ఎమ్ స్టూడియోలో ప్రారంభోత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో బాలకృష్ణ బొగ్గుగని కార్మికుల ప్రతినిధిగా నటించారు. బాలకృష్ణ, విజయశాంతి నటించే సీన్ కు మోహన్ లాల్ కెమెరా స్విచాన్ చేయగా, రజినీకాంత్ క్లాప్ కొట్టడం జరిగింది.

నిర్మాత దేవి వరప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. నిప్పురవ్వ సినిమాలో పోలీస్ పాత్ర లో అలనాటి నటి లక్ష్మి కనిపించగా, బాలకృష్ణ సరసన విజయశాంతి నటించారు. కానీ పోలీస్ పాత్ర కు విజయశాంతిని, బాలకృష్ణ సరసన దివ్యభారతిని ఎంపిక చేద్దామనుకున్నారు. ఆ క్రమంలో దివ్యభారతి గల డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో.. బాలకృష్ణకు జోడీగా విజయశాంతిని, పోలీస్ పాత్రకు లక్ష్మిని తీసుకొని కథను కాస్త మార్చారు. ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్ని అందించగా, రండి రండి రండి అనే ఒక్క పాటను వేటూరి రాయగా, రాజ్ కోటి స్వరపరిచారు. ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ లను భారీ వ్యయంతో చిత్రీకరించారు. ఇందులోని ఒక పాట కోసం అప్పట్లో నే ఆస్ట్రీయా వెళ్లి చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు ఎంతో ఖర్చు చేసి చిత్రీకరించడం జరిగింది. ఆంధ్రా అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ కి అనుమతి లేకపోవడంతో ముంబాయి ఫారెస్ట్ ఏరియాలో నిప్పురవ్వ సినిమా చిత్రీకరించడం జరిగింది. మొదటి భాగం రషెస్ చూసి దానిలోని లోపాలను మార్చారు.

నిప్పురవ్వ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా తమిళంలో వైజయంతి ఐపీఎస్ పేరుతో విడుదలయ్యింది. ఆ సినిమాలో విజయశాంతి మాస్ ఇమేజ్ తో కనిపించారు. నిప్పురవ్వ సినిమాలో ఎలుగుబంటిని చూసి విజయశాంతి భయపడుతుంది.. అప్పటికీ ఆమె ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ కు ధీటుగా కొన్ని ఫైట్స్ విజయశాంతితో చేయించడం జరిగింది. అయితే ఎలుగుబంటిని చూసి భయపడిన విజయశాంతి సినిమా క్లైమాక్స్ లో రౌడీలతో ఫైట్ చేయడం ఏంటి అని ప్రేక్షకులు డైలమాలో పడ్డారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. సెకండాఫ్ లోగల లోపాలను మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కొంతమంది కోర్టుకు వెళ్లడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ 1993 సెప్టెంబర్ 3న బంగారు బుల్లోడు సినిమా తో కలిపి ఒకే రోజున విడుదల చేయడం జరిగింది. కానీ బంగారు బుల్లోడు సినిమా విజయం సాధించగా నిప్పురవ్వ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago