దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తరాది చిత్రాల్లో నటించిన ఎంతోమంది నటీనటులు ఉన్నారు. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల చిత్రాలు మొత్తం మద్రాసులోనే షూటింగ్ జరుపుకునేవి ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి సంబంధించినటువంటి స్టూడియోస్ అక్కడే ఉండడం మూలంగా ఆయా రాష్ట్రా భాష చిత్రాల షూటింగ్ కూడా అక్కడే జరుపుకునేవారు. అలా నటిస్తున్న క్రమంలో అనేకమంది నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించేవారు.
అలా తెలుగు సినిమాల్లో నుండి బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో శ్రీదేవి, జయప్రద ఆ తర్వాత విజయశాంతి కూడా ఓ హిందీ సినిమాలో తెరంగేట్రం చేశారు. అయితే కళాతపస్వి కె.విశ్వనాథ్ 1983 లో వచ్చిన సాగర సంగమం సినిమాకి మంచి పేరు రావడంతో మళ్లీ కమల్ హాసన్ తో స్వాతి ముత్యం అనే సినిమాను రూపొందించడం జరిగింది. కమలహాసన్ అమాయకపు పాత్రలో కనిపించగా, రాధిక భర్తను పోగొట్టుకున్న ఓ విధవరాలు గా నటించింది.
ఈ సినిమాలో కమల్ హాసన్ చేసిన నటన నభూతో న భవిష్యత్ గా చెప్పుకోవచ్చు. ఉత్తమ జాతీయ చిత్రంగా గా స్వాతిముత్యం ఎంపికయింది. అలాగే బంగారు నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. కె.విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కి నంది అవార్డు రావడం జరిగింది. ఈ సినిమాని తమిళంలో సిప్పికుల్, కన్నడంలో సుదీప్, మీనా జంటగా స్వాతి ముత్తుగా నిర్మించారు. 1987లో అనిల్ కపూర్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా ఇదే సినిమాను ఈశ్వర్ పేరుతో హిందీలో నిర్మించారు. అన్ని భాషల్లో రీమేక్ అయిన స్వాతిముత్యం అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…