Featured

ఏపీలోని ఆ ప్రాంతంలో మళ్లీ లాక్ డౌన్.. ఎందుకంటే..?

దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల మనకు లాక్ డౌన్ అనే పదం పరిచయమైంది. చాలా సంవత్సరాల నుంచే ఈ పదం వాడుకలో ఉన్నా దేశ ప్రజలకు కరోనా వైరస్ ఈ పదాన్ని పరిచయం చేసింది. మార్చి నెల 25 నుంచి మే 31వ తేదీ వరకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసింది. ఆ తరువాత అన్ లాక్ ను అమలు చేస్తూ కేంద్రం అన్ లాక్, అన్ లాక్ కు నిబంధనలను భారీగా సడలిస్తోంది.

కేంద్రం అన్ లాక్ సడలింపుల వల్ల ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కర్నూలు జిల్లాలోని ఒక ప్రాంతంలో మాత్రం మళ్లీ లాక్ డౌన్ అమలు కానుంది. రెండు రోజుల పాటు అధికారులు లాక్ డౌన్ తో పాటు 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి ఇప్పటికే కఠినంగా లాక్ డౌన్ ను, 144 సెక్షన్ ను అమలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

కర్నూలు జిల్లాలోని దేవరగట్టు ప్రాంతంలో దాదాపు 1000 మంది పోలీసులను మోహరించి కలెక్టర్ ఇక్కడ బన్నీ ఉత్సవానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నరు. ప్రతి సంవత్సరం దేవరగట్టులో దసరా పండుగ తరువాత కర్రల సమరం జరుగుతుంది. గతంలో ఈ కర్రల సమరం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రాణాలు పోతున్నా అక్కడి ప్రజలు మాత్రం ప్రతి సంవత్సరం బన్నీ ఉత్సవం పేరుతో కర్రల సమరం చేస్తున్నారు.

అయితే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని అడుగడునా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు బయట గ్రామాల నుంచి ఎవరూ దేవరగట్టులోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడం 34 గ్రామాల ప్రజలు దివిటీలు, కర్రలతో చేసే యుద్ధం వల్ల రక్తం ఏరులై పారుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుగుతుండగా కరోనా పరిస్థితుల వల్ల అధికారులు ఈ ఏడాది ఉత్సవం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

17 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

17 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

18 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

18 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

20 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

20 hours ago