Categories: FeaturedMovie News

ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఏడ్చిన సంగీతకి.. ఆ స్టార్ హీరో అలాంటి ఛాన్స్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు

సంగీత.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తనకి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఖడ్గం సినిమాలో చూపించినట్టుగా ఏ నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగి ఒకే ఒక్క ఛాన్స్ అని అడగాల్సిన అవసరం రాలేదు. దర్శకులకి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరింది లేదు. సంగీత చెన్నైలో పుట్టి పెరిగింది. తన తల్లిదండ్రులు అరవింద్, భానుమూర్తి. సంగీత తాతగారు కె.ఆర్.బాలన్. ఆయన సినిమా నిర్మాత.
సంగీత తాతగారు 20కి పైగానే తమిళ సినిమాలను నిర్మించారు. సంగీత తండ్రి  కూడా సినిమా దర్శకుడు. తమిళంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే సినిమాలను నిర్మించారు. సంగీత అసలు పేరు రసిక పి మణి. రసిక నివాస్ అనే పేరుతోను పిలుస్తారు. కన్నడ ఇండస్ట్రీకి సంగీత రసిక అనే పేరుతోనే పరిచయం అయింది. సంగీత పాఠశాలలో చదివేటప్పుడే భరతనాట్యాన్ని నేర్చుకున్నారు.  

అలా ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో ఆమెకి సినిమాల మీద ఆసక్తి కలిగింది. ఈ నేపథ్యంలోనే తమిళ చిత్రంతో 1997లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో వెంకట్ ప్రభుకి జంటగా నటించారు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకోవడంతో మలయాళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అదే సంవత్సరం మలయాళంలో కూడా అడుగు పెట్టింది. అంతేకాదు 1997లోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ సంగీత ఎంట్రీ ఇచ్చింది. తమిళ డెబ్యూ, మలయాళ డెబ్యూ, కన్నడ డెబ్యూ సినిమాలు సంగీత కి మంచి పేరు తీసుకు రావడంతో వరుసగా తమిళ, మలయాళ సినిమాలతో బిజీ అయింది.

అదే సమయంలో మన టాలీవుడ్ మేకర్స్ దృష్ఠి కూడా సంగీత మీద పడింది. దీంతో ఆమె మొదటిగా ఆశల సందడి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది. అయితే తెలుగులో సంగీత డెబ్యూ మూవీ అంతగా ఆడలేదు. దాంతో రెండేళ్ళకి మళ్ళీ జె.డి.చక్రవర్తి నటించిన నవ్వుతూ బ్రతకాలిరా చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. అయితే ఇందులో ఉన్న కోనసీమ కుర్రదాన్ని రో అనే పాట సంగీతకి బాగా పేరు తీసుకు వచ్చింది. దాంతో మా ఆయన సుందరయ్య సినిమాలో అవకాశం వచ్చింది.

ఈ రెండు సినిమాలలో సంగీత పర్ఫార్మెన్స్ చూసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇందులో సంగీత ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..నేనేంటో చూపిస్తా అంటూ ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్‌కి గానూ ఫిల్మ్ ఫేర్, సినిమా మా అవార్డ్స్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పెళ్ళాం ఊరెళితే, ఆయుధం, ఖుషీ ఖుషీగా, ఈ అబ్బాయి చాలా మంచోడు, సంక్రాంతి వంటీ సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. కానీ తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.  

కానీ బుల్లితెర మీద మాత్రం హోస్ట్‌గా, జడ్జ్‌గా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాలో ఆమెకి మంచి పేరు వచ్చింది. ఇక ఎవరూ ఊహించనిది అంటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించడమే. సంగీత మంచి డాన్సర్. భరత నాట్యం నేర్చుకున్నారు. ఆ కారణంగానే ఆచార్య సినిమాలో లాహే లాహే అంటూ సాగే సాంగ్‌లో నర్తించే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. ఈ సాంగ్‌లో మెగాస్టార్, కాజల్‌తో కలిసి కనిపించబోతున్నారు. చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం సంగీతకి పెద్ద డ్రీం. అది ఆచార్యతో నెరవేరింది. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago