Featured

గూగుల్ కు ఆ పేరు రావడం వెనుక ఇంత కథ ఉందా..!

స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం పదిసార్లైనా గూగుల్ ను తలుచుకుంటూ ఉంటారు. మనకు ఎలాంటి సందేహం వచ్చినా అందుకు సమాధానం మాత్రం గూగుల్ లోనే లభిస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ గూగుల్ సుపరిచితమే. అయితే గూగుల్ కు ఆ పేరు రావడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. వినడానికి గూగుల్ అనే పేరు వింతగా ఉన్నా గూగుల్ మన జీవితంలో భాగమైపోయింది.

22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఈ నెల 27వ తేదీతో 23వ ఏట అడుగుపెట్టింది. గూగుల్ అనే పేరు గూగోల్ అనే పదం నుంచి ఉధ్భవించింది. 100 సున్నాలతో ఉన్న సంఖ్యను గూగోల్ అని అంటారు. సెర్గేయ్ బ్రిన్, లారీ సేజ్ అనే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా ప్రజలకు మరింత తేలికగా సమాచారం తెలిసే విధంగా చేయాలని భావించి గూగుల్ ను అందుబాటులోకి తెచ్చారు.
 
బ్రిన్, లారీ ఇద్దరూ కలిసి సెప్టెంబర్ 27, 1998న గూగుల్ ను ప్రారంభించారు. 1940 లో కాస్నర్ అనే గణిత శాస్త్రవేత్త మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఇమాజినేషన్ అనే బుక్ లో గూగోల్ అనే పదం ఉపయోగించగా అనంతరం ఆ పదం నిఘంటువులోకి చేరింది. లారీ పేజ్, సెర్గే బ్రిన్ తమ కంపెనీకి ఫంకీగా పేరు పెట్టాలని అనుకున్నారు. వాళ్లు గూగోల్ ను కొద్దిగా మార్చి గూగుల్ ను అందుబాటులోకి తెచ్చారు.
 
గూగుల్ అంటే ఎంత సమాచారాన్ని అన్వేషించినా సులభంగా దొరుకుతుందని అర్థం. 2006లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో గూగుల్ పేరును చేర్చారు. గూగుల్ వాడకం పెరిగే కొద్దీ ఈ పేరు మరింత పాపులర్ అవుతోంది. ఎన్నో సెర్చ్ ఇంజన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ గూగుల్ స్థాయిలో మరే సెర్చ్ ఇంజన్ పాపులర్ కాకపోవడం గమనార్హం.

telugudesk

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

12 minutes ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

20 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

20 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

21 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

21 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

21 hours ago