General News

ఆ ఇంట్లోని ఓ గదిలో అరుపులు వినిపించాయి.. గదికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు..

సాధారణంగా ఏ ఇంట్లో అయినా వంటగదిలో ఫ్యాన్ ఏర్పాటు కోసం గోడకు ఓ కన్నం వదిలిపెడతారు. ఆ కన్నానికి ఎక్స్‌ట్రాక్షన్ ఫ్యాన్ సెట్ చేస్తారు. భవనం నిర్మించే సమయంలోనే దాదాపు ఆ పని పూర్తి చేస్తారు. కానీ చైనాలోని గిఝౌ ప్రావిన్స్‌… పుడింగ్ కౌంటీలోని ఆ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఆ కన్నం అలానే వదిలేశారు. ఆ ఇంట్లో ఉంటున్న ఓ బాలికకు అది అలా ఎందుకు వదిలేశారా అని.. ఆలోచించింది. తర్వాత చిన్నగా దాని పైకి ఎక్కింది.

ఆ బాలిక తన తలను అందులో దూర్చింది. దీంతో ఆ బాలికకు అందులో నుంచి రావడానకి తీవ్ర ఇబ్బంది పడింది. దీంతో అరవడం మొదలు పెట్టింది. కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు రూంకి వచ్చి చూశారు. అక్కడ ఎవరూ లేరు. కానీ తన కూతురు సౌండ్ మాత్రం వినిపిస్తుంది. మళ్లీ పెద్దగా అరిచింది. దీంతో వాళ్లు ఒక్కసారిగా పైకి చూసేసరికి షాక్ అయ్యారు.

అచ్చం ఆ బాలిక ఓ దెయ్యంలా కనిపించింది. తలకు ఉన్న వెట్రుకలు కిందకు వేలాడుతూ.. ఒక భూతంలా ఉంది. దీతో భయపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే ఫైర్ సిబ్బంది (Fire station)కి కాల్ చేశారు వెంటనే వాళ్లు వచ్చి పైకి చూడగానే ఒక్కసారిగా పాప తలను చూసి షాక్ అయ్యారు. దెయ్యం సినిమాల్లోలాగా ఉందే అనుకున్నారు.

వెంటనే ఫ్లోర్ పైకి వెళ్లి… పాపకు ధైర్యం చెప్పారు. ఆమె తన తలను ఎలా అందులో దూర్చిందో.. అలానే బయటకు తీద్దాం అనుకున్నారు. కానీ అలా కుదరలేదు. ఆ బాలిక తలకు ఓ ఆయిల్ రాసి చిన్నగా పైకి.. కిందకు లాగుతూ చివరకు విజయవంతంగా బయటకు తీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago