అలనాటి అగ్ర హీరోల నుంచి నేటి యువ హీరోల వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటీమణులలో అన్నపూర్ణమ్మ ఒకరు. అన్నపూర్ణమ్మ తన సినీ ప్రస్థానంలో పలు భాషలలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన చిన్నప్పటి జీవితంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎన్నో సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించిన అన్నపూర్ణమ్మను చిన్నప్పుడు తన తల్లి ఎదురుగానే ఓ చెట్టుకు కట్టేసి కొట్టారనే ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. అసలు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టేంత తప్పు ఏం చేసింది.? అలా కొట్టడానికి గల కారణం ఏమిటనే విషయాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
అన్నపూర్ణమ్మ చదువుకునే రోజుల్లో తెనాలిలో తన ఇంటి పక్కన ఓ మాస్టర్ దగ్గరికి హిందీ నేర్చుకోవడానికి ట్యూషన్ కి వెళ్ళేది. ఆ సమయంలో తన పక్కింటిలో తన స్నేహితురాలి అక్క మాస్టర్ ను ప్రేమించింది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆమె ఒక ఉత్తరం మాస్టర్ కి ఇవ్వమని చెబుతుండేది.అయితే ఆ ఉత్తరం ఏంటో తెలియని వయసులో అన్నపూర్ణమ్మ ఆ లెటర్ తీసుకువెళ్లి మాస్టర్ చేతికి ఇచ్చేది.
ఈ విధంగా ఒకరోజు ఉత్తరం తీసుకువెళ్తున్న సమయంలో తన స్నేహితురాలు తల్లిదండ్రులు చూసి ఆమె చేతిలో ఉన్న ఉత్తరం లాక్కున్నారు.ఆ విషయం గ్రహించిన మాస్టర్ అక్కడినుంచి పారిపోగా ఆ ఉత్తరంలో వారిద్దరూ ప్రేమించుకున్నట్టు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాసి ఉంది. ఈ విషయం తెలిసిన స్నేహితురాలు తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ తల్లికి ఈ విషయం చెప్పడంతో తల్లి బాగా ఉతకమని ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేయకుండా ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలోనే తన స్నేహితురాలి తల్లిదండ్రులు అన్నపూర్ణను చెట్టుకు కట్టేసి తన తల్లి ఎదురుగా కొట్టారని అయితే ఆ సమయంలో నాకు ఒక అవగాహన వచ్చిందని ఇకపై ఎవరి విషయంలోనూ ఇక్కడి విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పకూడదనే విషయాన్ని గ్రహించానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి అన్నపూర్ణమ్మ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…