ఒకవైపు సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ నుంచి మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ఎంతటి పాపులర్ షోగా మారిందో అందరికీ తెలుసు.
ఆ కార్యక్రమం లాగానే ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ షో ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా.. మొదట బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సీజన్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత నానీ, గత మూడు సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అయితే అంతటి హైప్ ను కూడా ఎవరు మీలో కోటీశ్వరులు వస్తుందని.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందేంటంటే.. మొదట ఎన్టీఆర్ ఎంతో లావుగా ఉండేవారు.. తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగలో బాగా స్లిమ్ గా తయారు అయ్యారు ఎన్టీఆర్.
ఈ విషయం గురించి ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ.. తాను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడినని అందుకు కొందరు తనని అసహ్యంగా ఉన్నావని అన్నారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దానికి తాను ఎంతో బాధపడేవాడిని అంటూ ఎదురుగా ఉన్న కంటెస్టెంట్ తో చెప్పారు. ఇలా షోలో అతడు తన వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంటూ.. కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు యంగ్ టైగర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…