ప్రస్తుతం బుల్లితెర సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సుడిగాలి సుదీర్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఎన్నో తిండి నిద్రలేని రాత్రులు గడిపిన సుదీర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు రాకుండా ఉండవు.
తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం 350 ఎపిసోడ్ లోకి ఎంటరైన నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్స్ వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు స్కిట్ రూపంలో చేసి చూపించారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కెవ్వుకార్తిక్ ఇమ్మానియేల్ చేసి అందరి చేత కంటతడి పెట్టించారు. 2012వ సంవత్సరంలో సినిమా కోసం గెటప్ శీను,సుడిగాలి సుధీర్ పడిన కష్టాలను కెవ్వు కార్తీక్ స్కిట్ రూపంలో చూపించారు.
సినిమా అవకాశాలను వెతుకుతూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా మూడు రోజులపాటు తినడానికి తిండి లేక ఆకలితో పస్తులు పడుకున్న సుధీర్ గెటప్ శీను ఒకప్పటి జీవితం అందరి హృదయాలను కలచివేసింది. స్కిట్ రూపంలో సుధీర్ పడిన కష్టాలను తెలుసుకున్న రష్మి కన్నీటి పర్యంతం అయ్యింది.
ఈ స్కిట్ పూర్తయిన తర్వాత కెవ్వు కార్తీక్ రష్మీని తన అభిప్రాయం ఏంటి అని అడగగా అందుకు రష్మి నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు వెలువడలేదు కేవలం ఆమె కంటి నుంచి నీరు మాత్రమే దారలుగా ప్రవహించాయి.రష్మీ సుధీర్ కష్టాలను తెలుసుకొని స్టేజ్ పైనే ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…