Movie News

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే 16మంది కంటెస్టెంట్స్ వీళ్లే.. ఫైనల్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే..!

బుల్లితెరపై మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ఎవరు అనే విషయం ఆ రోజే తెలియనుంది.

ఈ విధంగా బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజులలో ఈ షో ప్రారంభం కాబోతుందనగా హౌస్ లోకి వెళ్లే 16 మంది కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ డే ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యే 16 మంది కంటెస్టెంట్ ఎవరు అనే విషయానికి వస్తే.. యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, యూట్యూబ్ సరయు, లహరి శారీ, ప్రియాంక జబర్దస్త్, అనీ మాస్టర్, RJ కాజల్, మానస్, ఆటా సందీప్, షణ్ముఖ్ సీరియల్ నటి ఉమా దేవి, VJ సన్నీ,నటరాజ్ మాస్టర్, సిరి హన్మంత్ పోటీకి సిద్దం అయినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం వీరిలో కొంతమంది కంటెస్టెంట్ లు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హౌస్ లోకి ఎంటరైన కొన్ని వారాలకు మాత్రమే హౌస్ నుంచి బయటకు వెళుతున్నట్లు తెలుస్తోంది. వీరికి బయట ఇతర కమిట్మెంట్స్ ఉండటం వల్ల బిగ్ బాస్ నిర్వాహకులతో ఈ విధమైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

ఈ 16 మంది కంటెస్టెంట్ లో చివరి వారం వరకు కేవలం ఏడుగురు మధ్య పోటీ నెలకొందని, టైటిల్ పోరు కోసం ఈ ఏడుగురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఏడుగురు కంటెస్టెంట్ లు ఎవరూ అనే విషయానికి వస్తే యూట్యూబ్ సరయు, ఆర్.జె కాజల్, సన్నీ, ఆట సందీప్, యాంకర్ లోబో, రవి, యాంకర్ వర్షిని ఈ ఏడుగురు బిగ్ బాస్ చివరి వారం వరకు ఉండి టైటిల్ కోసం పోరాడుతున్నట్లు తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే కేవలం కొన్ని రోజులు వేచి ఉండాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago