హీరో కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో మనోడికి ఆఫర్లు భారీగానే వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత అతడు నటించిన సినిమాలు దానంత పెద్ద హిట్ కాలేదనే చెప్పాలి. అతడు కేవలం హీరోగానే కాకుండా.. వివిధ రకాలు జోనర్లను కూడా ట్రై చేస్తూ సినిమాల్లో నటిస్తున్నాడు.
హీరోగా చేసే సినిమాకు మాత్రం మంచి కథలను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు నటించిన చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమా నవంబర్ 12 న విడుదల కానుంది. ఈ సందర్భంగా అతడు ఆసక్తికరమైన విషయాలను పాత్రికేయులతో పంచుకున్నాడు. అవేంటంటే.. ఇప్పటి వరకు తాను వివిధ రకాల క్యారెక్టర్లు వేశాను .. కానీ మొదటి సారి ఇందులో టచ్ చేయని జోనర్ ఎంచుకున్నట్లు చెప్పాడు.
ఇందులో ఎన్ఐఏ ఎజెంట్ గా తన పాత్ర ఉంటుందన్నాడు. ఇటీవల ఫ్రీ రిలీజ్ వేడుకకు తనకు కాబోయే భార్య లోహితను వేదికపైనే ప్రపోజ్ చేశాడు కార్తికేయ. అయితే లోహిత ఇంత వరకు ఆర్ఎక్స్ 100 సినిమా చూడలేదని చెప్పాడు. దానికి కారణం సినిమా విడుదలకు ముందు తాము ఇద్దరం గొడవ పడ్డామని.. తర్వాత కలిసి చూద్దామంటే..తానే వద్దని చెప్పానన్నాడు.
ఒక వేళ ఆమె సినిమా చూస్తాను అంటే.. సెకండాఫ్ నుంచి చూడమని చెబుతానన్నాడు. అన్ని సంవత్సరాలు వాళ్లిద్దరు ప్రేమించుకున్నా.. వీళ్ల ప్రేమ విషయం ఇటీవలే వాళ్ల తల్లిదండ్రులకు తెలిసిందన్నారు. తానే ఇంట్లో చెప్పి.. పెళ్లికి ఒప్పించానని కార్తికేయ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…