Nidhi Agarwal - Simbu: కోలీవుడ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఇస్మార్ట్ బ్యూటీ..?
Nidhi Agarwal – Simbu: ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి అందరికీ తెలిసినదే.త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొంత కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమలో ఉందని సమాచారం.
ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రేమ విషయాన్ని బయట పెట్టకపోయినా త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియ చేయనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
తమిళంలో శింబు నిధి అగర్వాల్ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గత కొంత కాలం నుంచి సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది.ఈ క్రమంలోనే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక వీరి సినిమాల విషయానికి వస్తే శింబు మానాడు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నిధి అగర్వాల్ సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదే కాకుండా మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…