Categories: FeaturedMovie News

ముందు నుయ్యి.. వెనక గొయ్యి… జబర్దస్త్ షో ఎలా గట్టెక్కుతుందో.!!

బుల్లితెరపై ఖతర్నాక్ కామెడీ షో “జబర్దస్త్’ కు ఉన్న ప్రాధాన్యతని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఒక్క కామెడీ షో నుంచి తెలుగు తెరకు కి ఎంతమంది కమెడియన్లు వచ్చారనే విషయంప్రేక్షకులందరికీ తెలిసిందే.!ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ లు తమ టాలెంట్‌తో వచ్చిన సినిమా ఆఫర్స్ ను బాగానే వాడుకుంటున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు ‘జబర్దస్త్” షో నుంచి “అదిరింది” షోలోకి షిఫ్ట్ అయ్యిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి.

“జబర్దస్త్” షో కు ధీటుగా స్టార్ కమెడియన్లు చంద్ర, ఆర్పీ, ధన్‌రాజ్, వేణులను “అదిరింది” షోలోకి ప్రవేశపెట్టినప్పటికీ ‘అదిరింది షో’ కు ఆశించినంత స్థాయిలో రేటింగ్ మాత్రం రావట్లేదని టాక్ వినిపిస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రియాలిటీ షో “బిగ్‌బాస్ సీజన్ 4” కరోనా లాక్ డౌన్ తర్వాత సెప్టెంబరు 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ తన మూడో వారం పూర్తి చేసుకోబో తుండగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ కాగా.. రెండో వారం కరాటే కళ్యాణి బ్యాగ్ వెళ్ళిపోయింది. మరోవైపు వైల్డ్ కార్డు ద్వారా ముగ్గురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కవ్వించే భామల అందాల ఆరబోతతో బుల్లితెర ప్రేక్షకులని ఎంత అలరించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఈ రియాలిటీ షోకు మొదటి వారం రికార్డు స్థాయిలో 18.5 హయ్యస్ట్ టీఆర్ఫీ రేటింగ్‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. మూడో వారం చేరుకునేసరికి ఈసారి మాత్రం ఘోరంగా ఆ రేటింగ్స్ అన్నీ పడిపోయినట్టు తాజా సమాచారం. ఒక వైపు జబర్దస్త్ కామెడీ షో.. మరో వైపు క్రికెట్ లవర్స్ ఫేవరేట్ ఈవెంట్ ఐపీఎల్ 2020 వీటితోపాటుగా బిగ్ బాస్ షో ఒకే టైం లో ప్రసారం కావదమే ఇందుకు కారణమని తెలిసింది. అంతేకాకుండా మిగతా భాషల్లో కూడా బిగ్ బాస్ కొత్త సీజన్లు స్టార్ట్ అవుతుండటంతో తెలుగు బిగ్ బాస్ 4కు అనుకోని రూపంలో మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా.. ఒక వైపు బిగ్ బాస్.. మరోవైపు ఐపిఎల్ నుంచి పోటీ ఎదుర్కొంటూ కూడా తన సత్తాని చాటుకోడానికి అన్ని ప్రయత్నిస్తుంది జబర్దస్త్ కామెడీ షో. దీనికి తగ్గట్లుగానే ఈ షో టీం మెంబర్స్ స్కిట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ షోలో కాంట్రవర్సీ టాపిక్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి పోటాపోటీగా ఉన్న బిగ్ బాస్ సీజన్ 4 & ఐపిఎల్ నుంచి జబర్దస్త్ షో ఎలా రేటింగ్స్ ను రాబడుతుందో చూడాలి. ఎంతైనా ఐపీఎల్ 2020 టోర్నమెంట్ అటు బిగ్ బాస్‌ షోపై, ఇటు జబర్దస్త్ షోపై భారీ ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ ముందు బిగ్ బాస్ & జబర్దస్త్ షోలు నిలబడటాయో లేదో వారం వేచి చూడాల్సిందే.!

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago