Movie News

సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారంటూ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న వర్ష.. ఓదార్చిన రష్మీ!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు లేదా బుల్లితెర నటీనటులు మీద సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్లు ట్రోలింగ్ రావడం అనేది సర్వసాధారణం.ఈ విధమైనటువంటి కామెంట్లు కొన్నిసార్లు సదరు నటీనటులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతాయి. అయితే ఈ కామెంట్లపై స్పందించి కొందరు తీవ్రస్థాయిలో నెటిజన్ల పై మండిపడతారు. మరికొందరు వారి బాధను బయటకు చెప్పుకోలేక ఎంతో మనో వేదన అనుభవిస్తుంటారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవం జబర్దస్త్ కమెడియన్ అయినటువంటి వర్షకి ఎదురయింది.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న. అను ఇమ్మానియేల్ తో జతకట్టి ఈమె చేసేటటువంటి స్కిట్లు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తన పై సోషల్ మీడియాలో కూడా దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఈ విషయమే జబర్దస్త్ వేదికపై తెలియజేస్తూ వర్ష కన్నీటిపర్యంతమయ్యారు.

గత వారం ఎపిసోడ్ లో భాగంగా భాస్కర్ స్కిట్ లో కామెడీ పండించిన వర్ష ఉద్దేశించి జడ్జి రోజా “ఏంటి వర్ష ఈమధ్య నీ మీద కామెంట్స్,ట్రోల్స్ ఎక్కువయ్యాయట, బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది” అని అనడంతో వేదికపైనే వర్ష కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈమె చెబుతూ స్టేజ్ పై మనం చేసేవన్నీ ప్రేక్షకుల ఆనందం కోసమే, ఇక్కడ మన నటనను చూసి అందరూ అభిమానిస్తుంటారు. సెట్ కి వచ్చినప్పుడు మనకి ఎంతో గౌరవం ఉంటుంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం దారుణమైన కామెంట్స్ చేస్తారంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

వర్ష నువ్వు ఎవరితోనైనా వెళ్ళావా? వర్ష కి ఎవడైనా ఉన్నాడా? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తుంటారని, తన తమ్ముడు ఈ కామెంట్లు చూసి మొహం పై ఫోన్ పెట్టి ఏంటక్కా ఇది? అని అడిగినప్పుడు దాన్ని ఫేస్ చేయలేకపోయానని స్టేజ్ పైన కన్నీరుమున్నీరయ్యారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ స్పందిస్తూ.. ఈ క్రమంలోని తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది. సుధీర్ ఎంతమందితో అయినా యాక్టింగ్ చేయవచ్చునేను వేరే వాళ్ళతో చేస్తే మాత్రం సుధీర్ తో చేయొచ్చు కదా అంటూ కామెంట్ చేశారని సుధీర్ వేరే వాళ్ళతో చేస్తే తప్పులేదు నేను చేస్తే తప్పంటారు అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వర్షకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago