Categories: FeaturedMovie News

Jacqueline Fernandez : జాక్వెలిన్ మెడకు చుట్టుకున్న ఈడీ కేసు… 215 కోట్ల దోపిడీ కేసు లో నిందితురాలిగా పేరు…!

Jacqueline Fernandez : సంచలనం సృష్టించిన సుఖేష్ చంద్ర శేఖర్ కేసు లో జాక్వెలిన్ కి ప్రమేయం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కు, బెదిరింపులకు పాల్పడి అక్రమాస్థులను సంపాదించిన ఆర్ధిక నేరస్తుడు సుఖేష్ చంద్ర శేఖర్ కు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ కి సంబంధాలు ఉన్నాయన్నట్లు ఈడీ తేల్చింది. 215 కోట్ల బెదిరింపులు కేసులో జాక్వెలిన్ పేరును ఈడీ చేర్చింది. సుఖేష్ చంద్ర శేఖర్ తో పోలీసులు అరెస్ట్ చేసే వరకు కూడా వీడియో కాల్స్ ద్వారా టచ్ లో జాక్వెలిన్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం ద్వారా ధ్రువీకరించారు. ఇక చంద్ర శేఖర్ కూడా అధికారుల విచారణలో జాక్వెలిన్ కు చాలా సార్లు బహుమతులు ఇచ్చినట్లు వెల్లడించాడు.

బ్రాండెడ్ బట్టలు.. ఖరిదైన కార్లు…

జాక్వెలిన్ దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందినట్లుగా విచారణ లో తెలిసింది. గతేడాది రికార్డు చేసిన స్టేట్మెంట్ ప్రకారం చంద్రశేఖర్ నుండి గూచీ, చానెల్ వంటి బ్రాండ్ల మూడు డిజైనర్ బ్యాగ్స్, జిమ్ వేర్ కోసం రెండు గూచీ దుస్తులను, ఒక జత లూయిస్ విట్టన్ షూస్, రెండు జతల డైమండ్స్ తీసుకున్నట్లుగా ఈడీకి జాక్వెలిన్ తెలిపింది. అలాగే తనకు సుఖేష్ ఇచ్చిన మినీ కూపర్ కారును అతడికి తిరిగి ఇచ్చినట్లు జాక్వెలిన్ తెలిపింది. గతేడాది ఆగస్ట్ 7న సుఖేష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసే వరకు సుఖేష్ తో జాక్వెలిన్ రెగ్యూలర్ గా టచ్ లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దాదాపు ఆమెకు సంబంధిచిన 7 కోట్ల ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ జప్తు చేసింది. ఇప్పటికే చంద్ర శేఖర్ మీద పలు రాష్ట్రాల్లో 32 క్రిమినల్ కేసులు నమోదైయ్యాయి. మూడు కేంద్ర ఏజెన్సీలు, సీబీఐ, ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ , ఆదాయపు పన్ను శాఖలు మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. జాక్వెలిన్ కు చంద్ర శేఖర్ తో సంబంధాలు ఉన్నాయని పలుమార్లు ఈడీ జాక్వెలిన్ ను ప్రశ్నించింది.

గతేడాది ఢిల్లీ కి సంబంధించిన ఒక వ్యాపారవేత్తకు బెయిల్ ఇప్పిస్తానని వ్యాపార వేత్త భార్యకు స్పూఫ్ కాల్ చేసి 215 కోట్లు వసూలు చేసాడు. ఢిల్లీ లోని ప్రధాని కార్యాలయం, న్యాయ శాఖ, హోమ్ శాఖ కి సంబంధించిన అధికారి అంటూ పలు మార్లు ఫోన్ చేసి బెయిల్ ఇప్పిస్తానని తమ ఫార్మా కంపెనీకి సహాయం చేస్తానని నమ్మించి 215 కోట్లు వసూలు చేసాడు. సదరు వ్యాపారి భార్య ఫిర్యాదుతో చంద్ర శేఖర్ మోసాలు బయటకు వచ్చాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago