పవర్ స్టార్ కెరీర్ లో అత్యంత ప్రెస్టీజియస్ మూవీగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తొలిసారిగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నారు.
ఇప్పటి వరకు తెలుగుకే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ఇతర మూవీ ఇండస్ట్రీలకు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈమూవీలో ఓ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెస్ ను ఎంపిక చేశారు. ఈ మధ్య సుకేష్ చంద్రశేఖర్ వ్యవహారంలో ఈడీ జాక్వలేన్ కు కూడా నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన జాక్వెలిన్ ను ఇటీవల అధికారులు పట్టుకున్నారు.
దేశం విడిచివెళ్లవద్దని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అందుకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి ఈ బ్యూటీని తప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈవ్యవహారంపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతోనే జాక్వలెన్ మూవీ నుంచి తప్పుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ పాత్ర కోసం నర్గీస్ ఫక్రిని తీసుకోనున్నట్లు తెలిసింది.
అయితే ఇప్పుడు జాక్వలిన్ ను ఈడీ కేసుల్లో చిక్కుకోవడంతో ఈప్రస్తావన వచ్చిందంటూ.. క్రిష్ తెలిపాడు. పవన్ కళ్యాన్ నటిస్తున్న ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రంలో నర్గీస్ ఫక్రి కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ ఎఎం రత్నం.. ప్రతిష్టాత్మకమైన సూర్య మూవీస్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…