AP politics: ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నామినేషన్ దాఖలు ఎప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల ఫలితాలు విడుదల తేదీలను గురించి క్లారిటీ ఇచ్చారు. మే 13వ తేదీ ఎన్నికలు జరగగా జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలను తెలియజేయబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలియజేశారు. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో చాలా హడావిడిగా కనిపించారు. ఇక ఈయన ఏకంగా ఎన్నికల ఫలితాలు విడుదలై తానే గెలిచాను అన్న ధోరణిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.ఐదేళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని తన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ట్విట్టర్ ద్వారా ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేస్తూ.. పోలింగ్ రోజుని హైలైట్ చేస్తూ మే 13, 2024 సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు.
స్పందించని పవన్..
ఇలా వీరిద్దరి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం గమనార్హం. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…