Madhavan: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తుకు పొందినటువంటి వారిలో మాధవన్ ఒకరు. ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే హీరోగా ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల కాలంలో మాధవన్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక మాధవన్ కుమారుడు వేదాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సాధారణంగా తల్లిదండ్రులు ఏ రంగంలో కొనసాగుతున్నారో పిల్లలను కూడా అదే రంగంలోకి పంపించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ మాధవన్ హీరో అయినప్పటికీ తన కుమారుడు మాత్రం అథ్లెటిక్ గా మారిపోయారు. వేదాంత్ కి స్విమ్మింగ్ లో ఇప్పటికే ఎన్నో నేషనల్ స్థాయిలో పథకాలు వచ్చాయి. ఇలా స్విమ్మింగ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేదాంత్ పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా తన కుమారుడి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై మాధవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నా కుమారుడు గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. నేను స్టార్ హీరో కాబట్టి తన కొడుకుకి స్విమ్మింగ్లో మెడల్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. నేను స్టార్ హీరో కాదు కేవలం ఒక హీరో మాత్రమే ఆయన తను ఇండస్ట్రీలో కాకుండా వేరే రంగంలో విజయం సాధిస్తున్నారని గుర్తు చేశారు.
వేరే వారితో పోల్చద్దు…
అలాగే వేదాంత్ ను ఇతర హీరోల కొడుకులతో పోల్చి కామెంట్స్ చేస్తున్నారు. మాకు మా అబ్బాయిని వేరే వారితో పోల్చడం ఏమాత్రం ఇష్టం లేదని దయచేసి మా గురించి ఇలాంటి వార్తలు రాసేవారు మా బాధలను అర్థం చేసుకోవాలి అంటూ ఈ సందర్భంగా మాధవన్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…