Connect with us

Featured

Madhavan: నా కొడుకు వేరే హీరోలా కొడుకులు మాదిరి కాదు.. మాకు అది ఇష్టం లేదు: మాధవన్

Published

on

Madhavan: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తుకు పొందినటువంటి వారిలో మాధవన్ ఒకరు. ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే హీరోగా ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల కాలంలో మాధవన్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక మాధవన్ కుమారుడు వేదాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాధారణంగా తల్లిదండ్రులు ఏ రంగంలో కొనసాగుతున్నారో పిల్లలను కూడా అదే రంగంలోకి పంపించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ మాధవన్ హీరో అయినప్పటికీ తన కుమారుడు మాత్రం అథ్లెటిక్ గా మారిపోయారు. వేదాంత్ కి స్విమ్మింగ్ లో ఇప్పటికే ఎన్నో నేషనల్ స్థాయిలో పథకాలు వచ్చాయి. ఇలా స్విమ్మింగ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేదాంత్ పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా తన కుమారుడి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై మాధవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నా కుమారుడు గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. నేను స్టార్ హీరో కాబట్టి తన కొడుకుకి స్విమ్మింగ్లో మెడల్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. నేను స్టార్ హీరో కాదు కేవలం ఒక హీరో మాత్రమే ఆయన తను ఇండస్ట్రీలో కాకుండా వేరే రంగంలో విజయం సాధిస్తున్నారని గుర్తు చేశారు.

Advertisement

వేరే వారితో పోల్చద్దు…
అలాగే వేదాంత్ ను ఇతర హీరోల కొడుకులతో పోల్చి కామెంట్స్ చేస్తున్నారు. మాకు మా అబ్బాయిని వేరే వారితో పోల్చడం ఏమాత్రం ఇష్టం లేదని దయచేసి మా గురించి ఇలాంటి వార్తలు రాసేవారు మా బాధలను అర్థం చేసుకోవాలి అంటూ ఈ సందర్భంగా మాధవన్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Featured

YS Sharmila: ఏపీ రాజకీయాలకు వైయస్ షర్మిల గుడ్ బై చెప్పినట్టేనా.. డిపాజిట్లు కూడా రావా?

Published

on

YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా కొన్ని సర్వేలు కూటమికి అధికారం రాబోతుందని చెప్పగా మరికొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి తిరిగి విజయం సాధిస్తారని వెల్లడించారు. ఇకపోతే ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీ రాజకీయాలలోకి వచ్చి సంచలనంగా మారారు వైయస్ షర్మిల.

ఎవరు ఊహించని విధంగా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఏపీపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ మూడు నెలల కాలంలో వైఎస్ షర్మిల తన అన్నయ్య ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా కీలకమైన సబ్జెక్ట్ ఎంచుకొని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేసినటువంటి షర్మిల ఎలాగైనా ఈ ఎన్నికలలో ఒక ఐదు నుంచి పది స్థానాలలో విజయం సాధిస్తారని అందరు భావించారు. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే మరోసారి కాంగ్రెస్ ఏపీలో చతికిల పడిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక కడపలో ఎంపీగా పోటీ చేస్తున్న ఈమెకు డిపాజిట్లు కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.

Advertisement

చతికిల పడిన కాంగ్రెస్..
కాంగ్రెస్ ఏ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం లేకపోవడంతో మరోసారి ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని దీంతో వైఎస్ షర్మిల కూడా తట్ట బుట్టా సర్దుకొని పార్టీకి అలాగే ఏపీ రాజకీయాలకు కూడా దూరం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆరా మస్తాన్?

Published

on

Pawan Kalyan: ఏపీ ఎన్నికలు మే 13వ తేదీ జరిగాయి. అయితే ఎప్పుడు రాని విధంగా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం భారీగా పెరిగింది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు మరొక రెండు రోజులలో రాబోతున్న నేపథ్యంలో అధికారం ఎవరిదనే విషయం గురించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

ఈ క్రమంలోనే పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుందని చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ప్రజానాడి ఈ పోల్ సర్వేలు కూడా సరైన స్థాయిలో పట్టు సాధించలేదని తెలుస్తోంది.

ఇకపోతే ఆరా మస్తాన్ సర్వే పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్తను తెలియజేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఈయన వెల్లడించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఉదయ్ కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు.

Advertisement

పవన్ గెలుపు ఖాయం..
అలాగే జనసేన పార్టీ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా ఆరా మస్తాన్ తన సర్వేలో వెల్లడించారు పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేశారని ఈయన తెలిపారు. ఈ సర్వేతో పాటు కేకే సర్వీస్ అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దే విజయం అని వెల్లడించడంతో జనసేన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: లండన్ నుంచి తిరిగి వచ్చిన వైయస్ జగన్.. ముఖ్య నేతలతో కీలక భేటీ?

Published

on

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తికాగా 17వ తేదీ ఈయన లండన్ వెళ్లారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఈయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు విమానాశ్రయంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ లండన్ పర్యటన నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ కి దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడంతో వెంటనే ఈయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసిపి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల ఫలితాలపై కొన్ని దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.

Advertisement

మరి కొన్ని గంటలలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో జగన్ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించినటువంటి ఈయన ఈసారి కూడా తమకే అనుకూలంగా ఉందని తను లండన్ వెళ్ళటానికి ముందే వచ్చేది మన ప్రభుత్వమే అని తెలియజేశారు.

వచ్చేది వైసీపీనే…
పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలలో 2019 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సీట్ల కంటే మరికొన్ని ఎక్కువగానే రాబోతున్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఘటనలు అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని ఈయన నేతలకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!