Jagapathi Babu: లెజెండ్ సినిమా సక్సెస్ సరిగ్గా వాడుకోలేదు… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు జగపతిబాబు ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం విలన్ పాత్రలలో తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా జగపతిబాబు ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండడం తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి లెజెండ్ సినిమా నా జీవితాన్ని మార్చిన సినిమా అని తెలిపారు ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతుందని వెల్లడించారు. లెజెండ్ సినిమాకు ముందు వరకు తన చేతిలో ఒక సినిమా కూడా లేదని ఎవరైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఎదురు చూశాను.

ఆ సమయంలోనే నాకు లెజెండ్ సినిమాలో అవకాశం కల్పించారు అయితే నేను ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకుంటానా లేదా అని వాళ్ళు కంగారు పడ్డారని కానీ నేను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని తెలిపారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది ఈ సినిమా తర్వాత నేను 100 సినిమాలో చేశాను కానీ ఈ స్థాయిలో సరైన క్యారెక్టర్ ని మాత్రం ఎంచుకోలేకపోయానని తెలిపారు.

కెరియర్ మరోలా ఉండేది..
ఈ సినిమా తరువాత శ్రీమంతుడు అరవింద సమేత రంగస్థలం వంటి సినిమాలు మినహా చెప్పుకోదగ్గ పాత్రలు ఏ సినిమాలోనూ లేవని తెలిపారు. లెజెండ్ సక్సెస్ ను కనుక నేను మంచిగా యూస్ చేసుకొని ఉంటే నాకు కెరియర్ మరో రేంజ్ లో ఉండేది అంటూ ఈ సందర్భంగా  జగపతిబాబు చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.